నవంబర్ 02 (ఆంధ్రపత్రిక): ఓ వైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్. పాత్ర నచ్చితే క్యారెక్టర్ నిడివి ఎంత అని ఆలోచించకుండా నటించే అతికొద్ది మంది నటులలో ఈయన ఒకడు. ఇటీవలే ఈయన నెగెటీవ్ పాత్రలో నటించిన ’గాడ్‌ఫాదర్’ రిలీజై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో విలన్‌గా సత్యదేవ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇక దీపావళికి రిలీజైన ’రామ్‌సేతు’లోనూ కీలకపాత్రలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ’ఫుల్‌బాటిల్’ ఒకటి. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సత్యేదేవ్ మెర్క్యూరి సూరిగా కనిపించనున్నాడు. ఈయన లుక్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఎస్డీ కంపెనీ, శర్వంత్రమ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక సత్యదేవ్ నటించిన లేటెస్ట్ చిత్రం ’గుర్తుందా శీతాకాలం’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా కృష్ణమ్మ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!