ఎలాన్ మస్క్. మనిషి కాదు రోబోట్ అనిపిస్తారు. ఎవరూ ఊహించనిది ఊహిస్తారు. ఎవరూ సాహసించనిది చేసి చూపిస్తారు. డ్రైవర్ లెస్ టెస్లా కారు తయారీ ఆయనకే సాధ్యమైంది. స్పేస్ టూరిజం సైతం ఆయన అంచనాలను అందుకుంది. ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ.. ట్విటర్ పిట్టను తన పంజరంలో బంధించేసుకున్నారు. మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టాడు. తల్లి అమెరికాన్. తండ్రి సౌత్ఆఫ్రికన్. ఇలాంటి అద్భుతాలు, సాహసాలు చేయగలిగేది మస్క్ మాత్రమే. అందుకే, ఆయనో బిజినెస్ టైకూన్. అయినా, ఆయనకు ఓ సొంతిల్లు కూడా లేదంటే నమ్మాల్సిందే. ఎలాన్ గురించి మరిన్ని వివరాలు, విశేషాలు…..
తనకు ఉన్న 7 లగ్జరీ బంగ్లాలను అమ్మేస్తున్నట్టు 2020లో మస్క్ ప్రకటించి సంచలనం రేకెత్తించాడు. జీవితంలో వైభవాన్ని తగ్గించుకుంటున్నానని చెప్పి తన 7 విలాసవంతమైన భవనాలను అమ్మేశాడు. ప్రస్తుతం మస్క్ ఓ చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బోక్సబుల్ అనే స్టార్టప్ కంపెనీ ఈ ఇంటిని నిర్మించింది. ఈ ఇంటిని మడిచి ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళ్లవచ్చు.
న్యూరాలింక్ టెక్నాలజీతో ఒక యంత్రాన్ని మస్క్ అభివృద్ధి చేయిస్తున్నాడు. ఇది మానవ మెదడును కంప్యూటర్‌కు కనెక్ట్ చేస్తుంది. దాంతో మనిషి ఆలోచనలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి నమ్మశక్యంగా లేకున్నా.. మస్క్ ట్రాక్ రికార్డ్ చూస్తే.. ఈ అద్భుతం అసాధ్యం కాదేమో అనిపిస్తోంది.
2004లో ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లాను స్థాపించాడు. టెస్లా కారంటే ఇప్పుడు యావత్ ప్రపంచానికి మోజు. ఆధునిక టెక్నాలజీ దీని సొంతం. డ్రైవర్‌తో పని లేకుండా.. జీపీఎస్ ఆధారంగా, సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో ప్రయాణించగలగడం ఈ కార్ స్పెషాలిటీ. ‘భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లతో సహా అన్నీ విద్యుత్‌తోనే నడుస్తాయి. ఆ మార్పును తీసుకురావడంలో టెస్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంద’ని మస్క్ అంటారు.
మానవుల గ్రహాంతర ప్రయాణమే లక్ష్యంగా ‘స్పేస్`ఎక్స్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అణుయుద్ధం లేదా ఏదైనా గ్రహశకలం ఢీకొనడం వల్ల భూమి ఉనికికే ప్రమాదం ఏర్పడితే, అలాంటి పరిస్థితుల్లో అంగారక గ్రహమే మానవులకు అత్యంత అనుకూలమని మస్క్ భావిస్తున్నాడు. మస్క్ అంచనా ప్రకారం 2050 నాటికి అంగారక గ్రహంపై మానవుల నివాసాలు ఏర్పడతాయి. ఆ నివాసాలను ‘స్పేస్ ఎక్స్‘ సంస్థ నిర్మిస్తుందని మస్క్ ప్రకటించారు.
1999లో రూ.77 కోట్లతో ‘ఎక్స్ డాట్‌కామ్‘ అనే సంస్థని ప్రారంభించాడు. తర్వాత దానిని ‘కన్ఫినిటీ‘ అనే కంపెనీకి అమ్మేశాడు. అదే ఇప్పటి ‘పేపాల్’.
12 ఏళ్ల వయస్సులో మస్క్ ఓ వీడియో గేమ్ రూపొందించి దానిని రూ.38 వేలకు ఓ కంపెనీకి అమ్మేశాడు. ఆ గేమ్ పేరు ‘బ్లాస్టర్‘.
మస్క్ తన సోదరుడు కింబ్లేతో కలిసి ‘జిప్`2‘ అనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. ఆ సంస్థను డెవలప్ చేసి రూ.170 కోట్లకు అమ్మేశాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!