ఎమ్మెల్యే చొరవతో పార్క్ ఏర్పాటు…
పట్టణవాసులకు తీపి కబురు…
తుడ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాం…
రేణిగుంట: ఫిబ్రవరి 10,(ఆంధ్రపత్రిక) : రేణిగుంట పట్టణ నడిబొడ్డులో ఉన్న మంచినీళ్ల గుంటకట్ట ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్న ప్రదేశం అయితే కాలక్రమేనా మంచినీళ్లు గుంట వ్యర్ధాలతో పిచ్చి మొక్కలతో అసాంఘిక కార్యక్రమాలకు అనువుగా ఉండడంతోపాటు ఆ ప్రాంతమంతా అస్తవ్యస్తంగా ఉండడంతో రేణిగుంట వాసులు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేయవలసిందిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మండల ఇంచార్జ్ శ్రీపవిత్ర రెడ్డి కి ఆ ప్రాంతాన్ని పరిశీలించమని ఆదేశించడంతో మండల ఇంచార్జ్ ఆ ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం మంచినీళ్లగుంట తుడా పరిధిలో వస్తుందని విషయం తెలుసుకుని తిరుపతి తుడా విభాగం అధికారులతో మాట్లాడడం వెను వెంటనే శ్రీపవిత్ర రెడ్డి సమక్షంలో ఆ ప్రాంతాన్ని తుడా కార్యదర్శి లక్ష్మి శుక్రవారం పరిశీలించి ఈ ప్రాంతాన్ని సుందరీ కరంగా మార్చి త్వరలోనే ఇక్కడ పార్కును ఏర్పాటు చేస్తామని శ్రీపవిత్ర రెడ్డి కి హామీ ఇచ్చారు. శ్రీపవిత్రరెడ్డి మాట్లాడుతూ రేణిగుంట పట్టణానికి తలమానికమైన మంచినీళ్ల గుంట ప్రాంతం అతి త్వరలో సుందరీకరణంగా మారి రేణిగుంట వాసుల కల నెరవేర నుంది ఇక్కడ పార్క్ ను ఏర్పాటు చేస్తామని గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే ఈ పార్క్ ను ఏర్పాటు చేయడం వల్ల రేణిగుంట మండల ప్రజలు సేద తీరడానికి అనువైన ప్రదేశం గాను ప్రశాంతంగాను ఉంటుందని, వయోవృద్ధులు మరియు వాకర్స్ కు మంచినీళ్ల గుంట విశాలంగా అణువుగా ఉంటుందని ఇలాంటి ప్రదేశంలో పార్కును ఏర్పాటు చేస్తున్న తుడా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు మండల ఇంచార్జ్, ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ రేణిగుంట మండల వాసులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళితే వెనువెంటనే వారి అవసరాలను తీర్చే విధంగా ఎమ్మెల్యే కార్యాచరణ చేపడతారనీ ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ హరి ప్రసాద్ రెడ్డి వైస్ ఎంపీపీ సుజాత సర్పంచ్ నగేష్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ కో ఆప్షన్ సభ్యులు సుభాన్ రాజా, వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.