ఎర్నాక్స్‌ను వరించిన నోబెల్ పురస్కారం
స్టాక్‌హౌం,అక్టోబర్6 (ఆంధ్రపత్రిక): సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డును ఫ్రెంచ్ రచయిత అనీ ఎర్నాక్స్(82) దక్కించుకున్నారు. వ్యక్తిగత జ్ఞాపకశక్తి మూలాలపై చేసిన ఎర్నాక్స్ చేసిన కృషికి ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడిరచింది. ఈ మేరకు నోబెల్ కమిటీ ప్రకటించింది. అత్యంత ధైర్యం, కచ్చితత్వంతో వ్యక్తిగత జ్ఞాపకశక్తి మూలాలపై చేసిన కృషికి ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడిరచింది. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్‌కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. ’పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్’లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు.నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు విూదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.