స్వేచ్ఛ ఒక పోరాటం, ఆనంద స్థితి. సత్యావగాహన, ఆస్వాదనీయం. ఒక అభిలషణీయమైన, హర్షదాయకమైన మార్పు. మనిషి మనీషిగా రూపొందగల మార్గం. స్వేచ్ఛ ఒక బాధ్యత, ఐక్యత, గౌరవభావన.ఒక వృద్ధుడు రోడ్డు మీద నడుస్తూ తన చేతిలోని వాకింగ్ స్టిక్‌ని గిరగిరా తిప్పుతూ నడవసాగాడు. ఏదో కూనిరాగం తీస్తూ చాలా సంతోషంగా ముందుకు సాగుతున్నాడు. తనొక్కడే రోడ్డుమీద ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఆలా తిరిగే కర్ర దెబ్బ నుండి చాలా మంది తప్పించుకుంటూ, పెద్దవాడు కనుక ఏమనలేక తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు.చివరకు ఒక విద్యార్థి ధైర్యంగా ఆ తిరుగుతున్న కర్రను చేత్తో పట్టుకుని ఆపి ఆయన తన స్వేచ్ఛనుకుంటూ చేస్తున్న ఆ పని వల్ల మిగిలినవారు ఎలా ఇబ్బంది పడుతున్నారో వివరించాడు. అంతేకాదు, ఆ స్వేచ్ఛ లోని విశృంఖలతను ఆయన దృష్టికి తెచ్చి, ఆలోచింప చేసాడు. అంతేకాదు మనకూ దాన్ని స్ఫురింపచేసాడు.నవ్వు తెచ్చే సంఘటనగా ఉన్నా దీని వెనక ఎంత గొప్ప భావన ఉందో చూడండి. స్వేచ్ఛను నిర్వచించి దానికున్న పరిధులు ఉంటాయన్న ప్రాథమికమైన ముఖ్య విషయాన్ని ఆ రచయిత చిన్న ఉదాహరణ ద్వారా ఎంత సులభంగా వివరించాడో చూడండి. మనం స్వేచ్ఛను అనుభవించే పద్ధతి ఇతరుల స్వేచ్ఛను హరించకూడదన్న విషయాన్ని ఎంత బాగా చెప్పాడో చూసారు కదా!మనకు నచ్చిన విధంగా మన జీవితాన్ని గడపటమే వ్యక్తిగత స్వేచ్ఛ. ఆహార, ఆహార్యాలలో, మనదైన భావనలో, సిద్ధాంతాలతో, విశ్వాసాలతో మన చిత్తానికి తోచినట్టు జీవితాన్ని సాగించటంలో పూర్తి స్వాతంత్య్రం, అలాగే, మన విశ్వాసానికి అనుగుణంగా ఒక దైవాన్ని లేదా అనేక దైవాలను ఆరాధించటంతో పాటు ఆ దైవప్రదేశాల సందర్శన మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు.మనకు నచ్చిన దైవాన్ని లేదా అందరి దైవాలను పూజించే హక్కు మన ప్రతి ఒక్కరికీ ఉంది. మన వ్యక్తిగతమైన ఈ స్వేచ్ఛకు అడ్డు చెప్పటం గాని అవరోధం కలిగించటం కాని, దీనిని తప్పు పట్టే అధికారం కాని ఇతరులకు లేదు. అలాగే మనకూ ఇతరుల స్వేచ్ఛలోకి చొరబడే హక్కు లేదని గ్రహించి అందుకు అనుగుణంగా వర్తించాలి. మన స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తూ ఇతరులకు ఉన్న ఆ స్వతంత్రతను గౌరవిం చటం మన సంస్కారాన్ని, విజ్ఞతను చాటుతుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!