మొగల్తూరు జూలై 13 (ఆంధ్ర పత్రిక గోపరాజు సూర్యనారాయణ రావు) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రవేశపెట్టిన ఉచిత 11 సర్వీస్ లను ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని మొగల్తూరు జడ్పిటిసి తిరుమల బాబ్జి అన్నారు. గురువారం మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న ఉచిత సేవలను గుర్తించి మరల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్థానికంగా ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజను మరలా మనమంతా ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉచిత సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాలపల్లి గ్రామ సర్పంచ్ కొప్పనాతి పల్లయ్య, మొగల్తూరు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు రేవు రాంబాబు, బండి ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొల్లాటి రామారావు, మొగల్తూరు మండల తాసిల్దార్ జి అనిత కుమారి, విఆర్ఓ శామ్యూల్ రాజ్, కార్యదర్శి సీతారామారావు, సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!