కుల్గామ్ : జమ్మూ కాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత కుల్గామ్ జిల్లాలోని దేవ్సర్ ప్రాంతంలోని అడిగామ్ గ్రామంలో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులతో జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బందికి, అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ముంతాజ్ అలీకి గాయ్యాలయ్యాయి అని పోలీసు అధికారులు తెలిపారు.
కాగా, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. తదుపరి వివరాలు తర్వాత వెల్లడిస్తామని జమ్మూకాశ్మీర్ పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే తాజాగా జరిగిన ఎన్కౌంటర్.. జరగబోయే మూడో దశలో కుల్గామ్ స్థానానికి ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం.