విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) : గణపతిరావు రోడ్డుకు సంబంధించి రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోడ్డును సిమెంట్ రోడ్డుగా నిర్మిస్తున్నామని పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఆదివారం స్థానిక కొత్తపేట 51,53,54 డివిజన్లలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న వెలంపల్లి శ్రీనివాసరావు కోటి 99 లక్షల రూపాయల నిధులతో గణపతిరావు రోడ్ ను సీసీ రోడ్డుగా వేసేందుకు, డ్రైన్ వీధిలో సైడు కాలువలు, రోడ్డు వేసేందుకు ,53వ డివిజన్ లో నూతన వాటర్ పైపులు వేసేందుకు శంకుస్థాపన చేశారు. అనంత రం వెలంపల్లి మాట్లాడుతూ ప్రజల కోరికను నేడు నేరవెర్చబో తున్నామన్నారు.నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి వున్నామని తెలిపారు.తాము చేసే అభివృద్ది పై చర్చకు సిద్దంగా వున్నామని ఆయన అన్నారు. నగర అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్న సీఎం జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ జగన్ హయాంలో నిర్మిస్తున్నామని అన్నారు.చంద్రబాబు గ తంలో విజయవాడ నగర అభివృద్ధికి ఇచ్చిన నిధులను అమరా వతికి బదిలీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,స్థానిక కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీరావు, మరుపిళ్ళ రాజేష్,హర్షద్ ,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు , శ్రీనన్న దళం అధ్యక్షులు పోతిన వర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!