నరసాపురం మొగల్తూరు అక్టోబర్ 14 ఆంధ్ర పత్రిక గోపరాజు సూర్యనారాయణ రావు)
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం ఉదయం రాష్ట్ర మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సుబ్బారాయుడు వెంట దొంగ స్వామి, వారతప్ప ఉప సర్పంచ్ దొంగ శ్రీను, ముత్యాలపల్లి మాజీ సర్పంచ్ కర్రి వీరస్వామి, కొల్లాటి భాస్కర్, కడలి జగన్, వీరవల్లి ముత్యాలు, అడ్డాల ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.