హైదరాబాద్ : గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఇవాళ ఆయనను విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలున్నాయి. గత నెలలో GOVT ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. ఈ నెల 11న ACB కేసు నమోదు చేసింది.