* *విజ్ఞాన ఆరోగ్య సమ్మిళిత విద్య ప్రదాత!*
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి*
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 7 (ఆంధ్రపత్రిక) : విద్యార్థి వికాసానికి విలువలతో కూడిన విద్యా బోధన అవసరం. విద్యార్జనలో విద్యార్థి ప్రగతి చురుకుగా సాగాలంటే అతనికి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. పరిపూర్ణ ఆరోగ్యం దక్కాలంటే అతనికి పోషకవిలువలతో వున్న ఆహారం సదా అందుతూ ఉండాలి. ఈ సత్యాలను అర్థం చేసుకున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి ఈ త్రిసత్య సాధనకు మేధో మధన సాగించి ఆవిష్కరించిన నవీన ప్రణాళిక కార్యాచరణలో అమోఘమైన సత్ఫలితాలు సాధించుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే విద్యా విషయమై, ప్రకృతి రమణీయత విషయమై సాధించుతున్న ప్రగతికి అందరూ నీరాజనాలు పడుతున్న నేపథ్యంలో నేడు సేంద్రీయ వ్యవసాయం సాగించుతూ పండించిన ఆకుకూరలు, కూరగాయలతో విద్యార్దులకు ఆహారం అందజేస్తూ అంతర్జాతీయ విశ్వ విద్యలయాలకు ఓ ఆదర్శ అధ్యయన కేంద్రం గా ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని నిలపటం తో సర్వత్రా మన్ననలుఅందివస్తున్నాయి.ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి సాగిస్తున్న ఈ మహోన్నత చారిత్రక ఆదర్శ ప్రస్థానము పూర్వాపరాలలోకి వెళ్తే .. విశ్వవిద్యాలయం లోవిద్య నభ్యసించడానికి వచ్చిన విద్యార్థులు ఇక్కడి వసతి గృహాలలో ఉంటూ మంచి ఆరోగ్యం తో ఉండాలని, అందుకు వారికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని , రసాయనాలతో క్రిమి సంహారక మందులతో కాకుండా సహజ సిద్ధమైన పద్ధతులతో పండించిన ఆహారాన్ని అందించాలని నాడు ఎఫ్. ఏ. సీ .వీసీ గా ఉన్నప్పుడు ఆలోచించారు. ఆలోచన వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయంలోని మూడు ఎకరాల స్థలం లో కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు నాటించి ఒక కొత్త ఆలోచన కు అంకురార్పణ చేశారు. వాటికి కావలసిన పోషణ చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతులతో విశ్వవిద్యాలయం లో కూరగాయలు, ఆకు కూరలు నిరంతరం పండించి వాటిని హాస్టళ్లలో ని విద్యార్థులకు భోజనం లో అందిస్తున్నారు. .తద్వారా విశ్వ విద్యాలయం లో చదువుకోవడం కోసం ఎంతో సుదూర ప్రాంతాలనుండి వచ్చి విశ్వవిద్యాలయ వసతి గృహాలలో ఉంటూ అక్కడే భోజనం చేసే విద్యార్థులకు ఎంతో ఆరోగ్యకర మైన నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం అందుతున్నది. నేడు ఈ వ్యవసాయ క్షేత్రం సందర్శకులను ,ఆచార్యులను,విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఓ విశ్వవిద్యాలయం లో ఈవిధమైన వ్యవసాయ క్షేత్రం రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా వినూత్నమైన ఆలోచనతో ముందుకు సాగడం, విశ్వ విద్యాలయానికి నిత్యం వచ్చే ఉభయ తెలుగు రాష్ట్రాలలోని విద్యాబోధకులను, విద్యార్థులనే కాకుండా దేశీయ,అంతర్జాతీయ ఆచార్యులకు సైతం విశ్వవిద్యాలయం ఆదర్శం గా నిలుస్తున్నది. మనసుంటే మార్గముంటుందన్నట్లుగా నాడు ఎఫ్. ఎ .సి .వీసీ గా ఉన్నప్పుడు ఆచార్య రాజశేఖర్ పట్టేటి మొదలు పెట్టిన ఈ కార్యక్రమం నేడు అందరిని ఆకట్టుకునేలా చేస్తున్నది. హైబ్రీడ్ పంటలు వచ్చిన తదుపరి పోషక విలువలు ప్రక్కన పెడితే దేశీయ కూరగాయలు పండ్ల లోని సహజసిద్ధమైన మాధుర్యం మాత్రం ఈ తరానికి అందించలేకపోవడం ఓ చిరు విషాదం. ఈ తరుణంలో దానిని అధిగమించడానికి ఇప్పటి తరానికి అటువంటి కూరగాయలు పండ్లు అందించడానికి ఇప్పటికే ఆచార్య రాజశేఖర్ పట్టేటి గారి నేతృత్వంలో అన్వేషణ ప్రారంభమైంది. భవిష్యత్తులో అది కూడా కార్యరూపం దాల్చనుంది. అంతేకాక విశ్వవిద్యాలయం ప్రకృతి రమణీయతతో హెర్బల్ గార్డెన్,బొటానికల్ గార్డెన్ వంటి వాటితో ఎటు చూసినా విశ్వవిద్యాలయం పచ్చదనంగా ఉంటూ సందర్శకులకు, ప్రకృతి ప్రేమికులకు మనోఉల్లాసం చేకూర్చుతూ నేత్రపర్వంగా ఉంటూ దేశ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించుతూ వుంది.హక్కులు గురించి పోరాడుతూ బాధ్యతలను విస్మరిస్తున్న వర్తమాన సమాజంలో తన బాధ్యతల నిర్వహణలో తన చుట్టూ వున్న సమాజ సమగ్ర వికాసానికి, ఉన్నతికి నిరంతరం విలక్షణ, సృజనాత్మక, ప్రయోజనాత్మక కార్యక్రమాలకు రూపకల్పన చేసి…వాటి అమలుని నిరంతరం స్వీయ పర్యవేక్షణ చేస్తూ అభ్యుదయ ఫలాలను అందించుతూ ఆదర్శ కృషిని సాగిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ పట్టేటి కృషిని ఆ ఫలితాలను పొందుతున్న విద్యార్థులే కాకుండా సమాజములోని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.వికసనమే తప్ప ముకుళితము ఎరుగని విద్యాకేంద్రం గా విశ్వాన ఎగుర వేసిన మేధో చైతన్య బావుటాగా కీర్తి గాంచిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రభ ఆచార్య రాజశేఖర్ పట్టేటి కృషితో నేడు మరింత దేదీప్యమానమవుతున్నదని విశ్వ విద్యాలయ పూర్వ విద్యార్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.