Telangana Congress: ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్టు కోసం ఆ నేత ఇప్పుడు స్పీడ్ పెంచారటని టాక్. ఇన్ని రోజులు డైలమాలో ఉన్నా ఇప్పుడు హైకమాండ్ ఇచ్చిన భరోసాతో పార్టీలో వేగం పెంచారట. ఆ అసెంబ్లీ టికెట్ విషయంలో ఇద్దరు నేతల మధ్య పోటీ ఉంది. వారిద్దిరలో ఒకరు పీసీసీ చీఫ్‌ను రేవంత్‌ను నమ్ముకోగా.. మరొకరు రాహుల్ గాంధీపై భరోసాతో ఉన్నారు. ఇద్దరూ రెండు గ్రూపులుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా అదిష్టానం మాత్రం ఆయనే వైపే చూస్తుండటంతో ఆ నియోజకవర్గ క్యాడర్ లో కూడ జోష్ వచ్చిందట. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు..?
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ టికెట్టు కోసం ఇద్దరు సీనియర్ నేతలు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందట. ఒకే పార్టీలో ఉన్నా.. ఉప్పు నిప్పులా ఎడముఖం పెడముఖంలా ఉంటున్నారట ఆ ఇద్దరు నేతలు. 2018 ఎన్నికల్లో మదన్ మోహన్ రాను జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి.. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారట. అప్పటి నుంచి ఎల్లారెడ్డి అసెంబ్లీ పై పోకస్ చేసి అక్కడ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక అక్కడే ఉన్నా మరో నేత సుభాష్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారట. ఆయన వెంటే నడుస్తున్నారట. తనకే టికెట్టు వస్తుందని నమ్మకంతో ఉన్నారట. మదన్ మోహన్ రావు మాత్రం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారట. రాహుల్ టీంతో ఉన్న సంబంధాలతో తనకే టికెట్టు వరిస్తుందని నమ్ముతున్నారట. ఇటుపార్టీ సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బట్టి విక్రమార్కలతో ఉన్న సంబంధాలతో టికెట్టు పై ఢోకా లేదని చెబుతున్నారట..సర్వేలు మదన్ మోహన్ వైపు..!
ఇక కాంగ్రెస్‌లో సర్వేల ఆధారంగా టికెట్లు డిసైడ్ చేస్తుండటంతో ఇప్పుడు ఎల్లారెడ్డి లో సర్వేల పరంగా మదన్ మోహన్ ముందు ఉండటంతో టికెట్ పై గట్టి నమ్మకంతో ఉన్నారట.. సునీల్ టీం చేసిన సర్వే లో ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో మదన్ కే మొగ్గు చూపాయట.. అదే కాకుండా అధికార పార్టీ సర్పంచ్ లను, ఎంపిటిసిలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం జిల్లా తో పాటు, రాష్ట్రంలో కూడ సంచలనంగా మారింది.. అధికార పార్టీని టార్గెట్ చేయడం కోసం నియోజవర్గంలో ఉన్న అధికార పార్టీతో పాటుగా, బిజేపిలో ఉన్న ముఖ్య నాయకులను మదన్ అపరేషన్ ఆకర్ష్‌తో పార్టీలో చేర్పించడంతో ఇప్పుడు అధిష్టానం మొగ్గు మదన్ వైపు చూస్తున్నారట. అటు సుభాష్ రెడ్డి సైతం తాను చేస్తున్న స్వచ్చంద సేవాను నమ్ముకోని ముందుకు వెళుతున్నారట.. వంత్ మాట ఇచ్చిన సర్వే ప్రకారమే టికెట్లు అనే నిబందన ఇప్పుడు సుభాష్ రెడ్డికి ఇబ్బందిగా మారిందట.దీంతో ఎల్లారెడ్డి టికెట్ విషయం ఇప్పుడు పార్టీలో మ్యాజికల్ చైర్ గా మారిందట.. ఇద్దరు బలమైన నేతలుగా గుర్తింపు ఉన్నా.. పార్టీ సర్వేలు ఎవరికి హీరో చేస్తాయి.. అన్నది నేతలను టెన్షన్ పెడుతుందట. ఇద్దరిలో ఎవరికి టికెట్టు వచ్చినా.. మరకరు ఏ మేరకు సహకరిస్తారన్నది చూడాల్సి ఉంది.