నంద్యాల,అక్టోబర్12(ఆంధ్రపత్రిక): ఎగువన కృష్ణానీటి రాకతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు డ్యాం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ప్లో 1,26,289 క్యూసెక్కుల నీరు వస్తుండగా 1,22,435 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.70 అడుగుల వరకు నీరు నిల్వ ఉందని వెల్లడిరచారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని వివరించారు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది, ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్‌ప్లో 19,203, ఔట్‌ఎª`లో 17,108 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్ధ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.99 టీఎంసీలకు వరకు నీరు నిల్వ ఉంది. అలాగే నాగార్జునసాగర్, పులిచింతల జలాశయా లకు వరద కొనసాగుతోంది. సాగర్‌కు మంగళవారం సాయంత్రం 1,30,261 క్యూసెక్కులు వస్తుండగా, అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు 1.16 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, అదే స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి పులిచింతలతో పాటు మున్నేరు తదితర ప్రాంతాల నుంచి మొత్తం 1.64 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, ఐదు వేల క్యూసెక్కుల నీటిని పంట కాలువలకు, 1.59 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!