నల్లగొండ మర్రిగూడ బైపాస్ రోడ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. షాక్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైనట్లు చెబుతున్నారు. కాలిపోయిన బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్ కి సంబంధించినదిగా గుర్తించారు పోలీసులు. ఉన్నపళంగా మంటలు చెలరేగడంతో వస్తువులు, ముఖ్యమైన పత్రాలు కాలిపోయాయని అందులోని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదంటున్నారు ప్రయాణికులు.
మూడు గంటలుగా రోడ్డుపై నిరీక్షణకు గురయ్యామన్నారు. ప్రమాద జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు ప్రయాణికులు. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. బస్సులో ఎముకలు పడి ఉండటాన్ని పోలీసులు తెల్లవారుజామున గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిజంగా షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. లేక డ్రైవర్, ట్రావెల్స్ యాజమాన్యాల తప్పిదం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.