YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో మరో సంచలనం కలకలం రేపుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ తండ్రి.. వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదో వ్యక్తి ఆయన.. మరి తరువాత ఏం జరగనుంది.. నెక్స్ట్ ఎవరు అంటూ చర్చ జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పెను సంచలన నమోదైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) లో.. కీలక మలుపు చోటుచేసుకుంది. కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తండ్రి భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy) ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. సుమారు మూడు గంటల పాటు ఇళ్లంతా సోదాలు చేశారు.. అయితే ఈ సందర్భంగా తమ లాయర్లను అనుమతించాలని కోరితే.. అందుకు సీబీఐ ఆంగీకరించలేదు. అక్కడికక్కడే అరెస్ట్ మెమో జారీ చేసి.. భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల వాహనాలను అవినాష్ అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత కనిపించింది. అయితే వారందర్నీ పక్కకు నెట్టుకుంటూ వాహానాన్ని కడప జిల్లా దాటించారు. భాస్కర్‌రెడ్డిపై సెక్షన్ 130బి,రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మికి అరెస్టు సమాచారం ఇచ్చి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు భాస్కర్‌రెడ్డి ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్ చేశారు.
ఈ కేసులో వివేకా హత్య కేసులో అవినాశ్‌ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే తరువాత ఎవరిని అరెస్ట్ చేస్తారన్నది ఉత్కంఠ పెంచుతోంది.
1. సునీల్ యాదవ్
2. గజ్జల ఉమా శంకర్ రెడ్డి
9 సెప్టెంబర్ 2021స
3.దేవిరెడ్డి శంకర్ రెడ్డి
18 నవంబర్ 2021
4.ఉదయ్ కుమార్ రెడ్డి
14 ఏప్రిల్ 2023
5.వైఎష్ భాస్కర్ రెడ్డి
16 ఏప్రిల్ 2023
అయితే ఈ కేసులో తరువాత అరెస్ట్ అవినాష్ రెడ్డిదే అని అనుమానాలు వ్యక్తం చేస్తారు. అందుకే ఆయన గతంలో అరెస్ట్ చేయకూడదు అంటూ ముందస్తుగా కోర్టును ఆశ్రయించారు. ఈ హత్య కేసులో అవినాశ్‌ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేక్‌అవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో అవినాశ్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను సంచలన చోటు చేసుకున్నాడు. ఈ అరెస్టులలతో ఏపీలో రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశం ఉంటుంది.
3 ఆగస్ట్ 2021