ఢిల్లీ మెట్రో ట్రైన్లో ఆ యువతిని చూసి షాకయిన తోటి ప్రయాణికులు..!
ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో మినీ స్కర్ట్(Mini-Skirt)తో హల్చల్ చేసిన..

ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో మినీ స్కర్ట్(Mini-Skirt)తో హల్చల్ చేసిన ఓ యువతి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై సోషల్ మీడియా(Social Media)లో హాట్ హాట్ గా చర్చలు సాగుతున్నాయి. ఇదేం పద్దతంటూ నెటిజన్లు ఓ రేంజ్లో సెటైర్లతో విరుచుకు పడుతున్నారు. పొరపాటున మహిళా సాధికారతకు ఇది ఉదాహరణ అయితే మన యువతరం అమ్మయిలంతా అలాంటి సాధికారతకు గురవుతారని ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.
మినీ స్కర్ట్‌తో యువతి ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ ఇన్స్పిరేషన్తో ఆమె ఇలాంటి డ్రెస్‌లు ధరిస్తోందా..? యూజర్లు కామెంట్ చేస్తున్నారు. నిజ జీవితంలో ఓ వ్యక్తిని కాపీ కొట్టే ట్రెండ్ సోషల్ మీడియాలో మొదలైందా? అని మరికొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకే ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తున్నారని కొందరంటుంటూ.. తల్లిదండ్రులు సోదరులతో కలిసి మెట్రోలో ప్రయాణించాలంటే భయమేస్తుందని ఇంకొందరు కామెంట్ చేశారు. ఇది మహిళా సాధికారతకు ఉదాహరణ అయితే, అయ్యో.. మన యువతరం అమ్మాయిలు అలాంటి సాధికారతకు గురవుతారు అని సెటైర్లు వేస్తున్నారు. సిగ్గులేని స్తీవాదులు కోరుకునేది ఇదేనా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.
అయితే ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న అమ్మాయి 19 ఏళ్ల రిథమ్ చన్నానా తన డ్రెస్పింగ్ను సమర్ధించుకుంటోంది. ‘‘నేను ఎలాంటి బట్టలైనా వేసుకునే స్వేచ్ఛ నాకు ఉంది. నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో, పేరు తెచ్చుకోవడం కోసమో ఇలా చేయడం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను’’అని ట్వీట్ చేసింది.