ఆంద్రపత్రిక పిబ్రవరి 9 సామర్లకోట/ పెద్దాపురం మండలం ; జి.రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫాక్టరీలో గురువారం ఉదయం జరిగిన దుర్ఘటనలో మరణించిన 7గురు కార్మికుల కుటుంబాలు ఒక్కక్కరికీ 25 లక్షలు ఎక్స్ గ్రేషియా సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. గురువారం ఉదయం దుర్ఘటన సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులతో హుటాహుటిన జి.రాగంపేటలోని ఆయిల్ ఫ్యాక్టరీన సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలను విచారించారు. ఉదయం 7 గంటల సమయంలో ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంక్ ను శుభ్రపరిచే సందర్భంలో ఊపిరి ఆడక 7 గురు వ్యక్తులు మరణించారని, వీరిలో 5గురు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరుకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు. పాడేరుకు చెందిన 5 గురు వ్యక్తులు, వెచంగి కృష్ణ (35), వెచంగి నరసింహ (38), వెచంగి సాగర్ (20), కురవడు బంజుబాబు, కుర్రా రామారావు కాగా, పులిమేరుకు చెందిన ఇరువురు వ్యక్తులు కట్టమూరి జగదీష్ (25), యల్లమిల్లి దుర్గాప్రసాద్ ఉన్నారు. ప్రమాదం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని, ఒక్కొక్కరికీ 25 లక్షలు వంతున ఎక్స్ గ్రేషియా సహాయన్ని ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ప్రమాదం జరిగిన ఫాక్టరీని సీజ్ చేయడం జరిగిందని, ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, జిల్లా పరిశ్రమల అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, పెద్దాపురం ఆర్డీవో లతో కూడిన ఐదుగురులు అధికారుల బృందాన్ని నియమించామని, మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ బృందాన్ని ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలోజిల్లాఎస్ పి రవీద్రనాద్, పెద్దాపురం ఆర్డిఓ జె.సీతారామారావు, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ రాధాకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప,జనసేననాయకుడు తుమ్మలరామస్వామి, కార్మికసంఘాలనాయకులు తదితరులు పాల్గొన్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!