రైతులు గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే వాటిని రద్దు చేస్తామని చెప్పడంతో సమ్మెను విరమించారు. తాజాగా మరోసారి పంజాబ్, హరియాణా రైతులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు.
రైతులు గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే వాటిని రద్దు చేస్తామని చెప్పడంతో సమ్మెను విరమించారు. తాజాగా మరోసారి పంజాబ్, హరియాణా రైతులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం పిలుపు ఇవ్వడంతో వందలాది ట్రాక్టర్లలో రైతులు రోడ్లెక్కారు. దీంతో పంజాబ్, హరియాణా, చండీగఢ్ ప్రాంతాల సరిహద్దులను పోలీసులు మూసివేశారు.
ఈ నిరసనల్లో భాగంగా రైతులు ఆదివారం మొహాలిలోని అంబ్ సాహిబ్ గురుద్వారాకు చేరుకున్నారు. సోమవారం అక్కడి నుంచి చండీగఢ్ వైపుగా వెళ్తామని రూట్ మ్యాప్ ప్రకటించారు. గతంలో పంజాగ్ హరియాణా హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు వెలువరించింది. రైతులు రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలపడం కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని పంచ్‌కుల పోలీస్ కమిషనర్ తెలిపారు. రైతుల యాత్రలను, నిరసనలను అడ్డుకునేందుకు చండీగఢ్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బలగాలను మొహరించింది. చండీగఢ్ – పంచ్‌కుల సరిహద్దు ప్రాంతాలను మూసేసి మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. కేవలం ర్యాలీలకు మాత్రమే అనుమతి ఉందని రోడ్లపై బైఠాయించడం, ట్రాఫిక్ కు అంతరాయం కల్గించడం లాంటివి చేయకూడదని హెచ్చరించింది.