ఆ బాధ్యత పోలీసులదే: ఏపీ హైకోర్టు
అమరావతి,అక్టోబర్ 21 (ఆంధ్రపత్రిక): అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు పోటీగా ఇతరుల నిరసనకు తావులేకుండా పోలీసులే చూసుకోవాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.రైతుల పాదయాత్రను అడ్డుకుంటున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం రెండు రోజుల పాటు విచారణ చేపట్టింది.పాదయాత్ర సజావుగా సాగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కోర్టు ముందు వివరాలు ఉంచాలని గురువారం న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో కోర్టుకు ఇరుపక్షాలు వివరాలను సమర్పించాయి. ఇరువైపుల వాదనలు, వారు సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడిరచింది. పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని.. మద్దతు తెలిపేవారు రోడ్డుకు ఇరువైపుల ఉండి సంఫీుభావం తెలపాలని పేర్కొంది. గతంలో పాదయాత్రలో పాల్గొనేందుకు ఏయే వాహనాలకు అనుమతి ఉందో అవి మాత్రమే ఉండాలని సూచించింది. రైతుల పాదయాత్ర సజావుగా జరిగేలా, వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గురువారం జరిగిన విచారణలో భాగంగా రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపిస్తూ.. రైతుల పాదయాత్ర రాజమహేంద్రవరంలోకి ప్రవేశించగానే చోటుచేసుకున్న పరిణామాలను కోర్టుకు వివరించారు. వైకాపా ఎంపీ భరత్ ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలపడమే కాకుండా రైతులపైకి రాళ్లు, వాటర్ బాటిళ్లు విసిరి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఆ పరిణామాలను కోర్టుకు వివరించారు. పాదయాత్రను అడ్డుకునేందుకు కావాలనే అలా చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎవరైనా నిరసనలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవా లని.. అయితే వైకాపా శ్రేణులు, నేతలు ఎలాంటి అనుమతి లేకుండా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశార న్నారు. పాదయాత్ర సజావుగా సాగేలా పోలీసులు సహకరించేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు పాదయాత్రలో రెచ్చగొట్టే విధంగా రైతు లు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపార.