నవంబర్ 12 (ఆంధ్రపత్రిక): నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం.
ఎన్టిఆర్30’. ’ఆర్ఆర్ఆర్’ వంటి ఇండస్టీ హిట్ తర్వాత ఈ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా తారక్‌కు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన, కొరటాల శివ ’ఎన్టిఆర్30’కు దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ వస్తున్న వార్తలపై ఇటీవలే చిత్రబృందం ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే మేకర్స్ కొరటాల శివ, సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమఘ్నమైనట్లు ఫోటోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులను మరింత వేగవంతం చేసిందట. ఎట్టి పరిస్థుతుల్లో ఈ సినిమాను డిసెంబర్లో సెట్స్ విూదకు తీసుకెళ్ళాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి ’దేవర’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలనలో ఉంచినట్లు టాక్. అయితే గతంలో ఈ టైటిల్‌ను బండ్ల గణెళిష్ పవన్ సినిమా కోసం రిజస్టర్ చేయించాడట. కాగా ఇప్పుడు కొరటాల శివ ఈ పేరును అనుకుంటున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా మెడికల్ మాఫీయా నేపథ్యంలో తెరకెక్కనుందట. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించనున్నట్లు టాక్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!