31న రీ రిలీజ్ కానున్న అలనాటి చిత్రం
డిసెంబర్ 27 (ఆంధ్రపత్రిక): కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదూ. ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని పిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో ’ఖుషీ’ ఒకటి. అప్పటికే ఐదు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరువిూదున్న
పవన్‌కు ఈ సినిమా డబుల్ హ్యట్రిక్‌గా నిలిచింది. పవన్ డ్రెస్సింగ్ స్టైల్, హేయిర్ స్టైల్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో పవన్`భూమిక కెమిస్ట్రీకి ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. పేరుకు తమిళ దర్శకుడే అయిన.. ఎస్.జే సూర్య ఈ సినిమాను తెలుగు నెటీవిటీకి తగ్గట్లు మార్పులు చేసి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మణిశర్మ స్వర పరిచిన పాటలైతే ఇప్పటికి చెవులలో మార్మోగుతునే ఉన్నాయి. సినిమా రిలీజై 21ఏళ్ళయినా ఇప్పుడు చూసిన కొత్త ఫీల్ కలుగుతుంది. పవన్ అభిమానుల్లో జోష్ నింపడానికి ఈ సినిమా రీ`రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 31న ఈ మూవీ పెద్ద ఎత్తున రీ`రిలీజ్ కాబోతుంది. కాగా ఇటీవలే ఈ సినిమా 4ఐ వెర్షన్ ట్రైలర్ విడులైంది. సిద్ధూ సిద్దార్థరాయ్ అంటూ పవన్ డైలాగ్స్, మేనరిజం, భూమికతో లవ్ ట్రాక్ సీన్స్ ఇలా అన్ని హంగులతో ట్రైలర్‌ను కలర్ ఫుల్‌గా కట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండిరగ్‌లో ఉంది. ఇక ఇప్పటికే రీ`రిలీజైన జల్సా పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఖుషీ మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.