దసరాలో నాని లాగా చేయబోయాడు
నటుల్ని అభిమానించే అభిమానులు కూడా నటుల్ని అనుకరించి ఈ మధ్య హంగామా చేస్తున్నారు. తాజాగా విడుదల అయిన ’దసరా’ సినిమా విషయంలో జరిగింది. ’దసరా’ సినిమాలో నాని పాత్ర బాగా తాగుతూ ఉంటాడు, అలాగే బొడ్డు చుట్టూ ఒక నాలుగు అయిదు ఆల్కహాల్ బాటిల్స్ కూడా కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అది స్ఫూర్తిగా తీసుకున్నాడేమో ఒక అభిమాని నాని చేసినట్టుగానే బాటిల్స్ మేడలో వేసుకొని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐరన్ ఫెన్స్ ఎక్కేసాడు. ఈ అభిమానం మరీ అతిగా ఉందని అక్కడకి వచ్చిన ప్రేక్షకులు అందరూ అనుకుంటున్నారు. వెంటనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఫెన్స్ ఎక్కి ఆ అభిమానిని కిందకి దించాడు. ఫెన్స్ ఎక్కినా అభిమానికి కిందపడి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు. ఇలా బాధ్యతరహింతా అభిమానులు చేస్తూ ఉంటే ఎలా అని అక్కడ ప్రేక్షకులు కూడా వాపోతున్నారు. పోనీ అదేమయిన మంచి పాత్ర అని అనుకునే కాదు కూడా అని అంటున్నారు. ఈమధ్య వెంకటేష్ కి కూడా ఇలానే అయింది. ఎంతో మంచి ఇమేజ్ వున్నా వెంకటేష్ ’రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో చేసాడు. అందులో తన అన్న కుమారుడు రానా దగ్గుబాటి కూడా చేసాడు. ఇది పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ అవటం, వెంకటేష్ పిల్లాడితో కూడా బూతులు మాట్లాడటం ఒక్కసారిగా సమాజంలో అన్ని వర్గాల వారి నుండి వ్యతిరేకత వచ్చింది. చేసేది లేక ఆ వెబ్ సిరీస్ ని తొలగించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!