Suma Arrest | యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు.
జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు సుమ. తాజాగా ఈమె అరెస్ట్ చేసినట్టు వార్తలు ఓ ఫోటో నెటింట వైరల్ అవుతుంది. ఈమె నాగ చైతన్య లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ అరెస్ట్ అయినట్టు డ్రామా చేస్తుందా.. లేదా నిజంగానే పోలీసులు ఈమెను తమ కస్టడీలో తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. యాంకర్ సుమ (Anchor Suma) విషయానికొస్తే.. ఈమె అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయిన ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు.
సుమ జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తున్నారు. యాంకర్ సుమ.. సినిమాల్లో చిరంజీవి తన డ్యాన్స్‌లతో, నటనతో తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో.. టీవీల్లో కూడా సుమ (Suma Kanakala) తన దైన స్టైల్లో యాంకరింగ్‌కు చేస్తూ అప్పటికప్పుడు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. ఇక అది అలా ఉంటే సుమ ఒక్క షోకు ఎంత వసూలు చేస్తుంటారో తెలుసుకోవాలనీ చాలా మందికి ఆసక్తి ఉంటుంది.
పోలీసుల అదుపులో సుమ కనకాల (Twitter/Photo)
సుమ తెలుగులో పాపులర్ యాంకరే కాదు.. టాప్ యాంకర్ కూడా. స్టార్ హీరోలకు చెందిన ఏ ఫంక్షన్ అయినా, సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు అయిన ఆమె హోస్ట్ చేయాల్సిందే. సుమ ఒక్కో షో, ఈవెంట్‌కి దాదాపుగా రూ. 2-2.5 లక్షలు వసూలు చేస్తుంటారని టాక్. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ యాంకర్‌లలో ఒకరిగా పేరుపొందిన ఈ 48 ఏళ్ల స్టార్ యాంకర్ ప్రస్తుతం పలు టీవీ షోలతో సూపర్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సుమ అడ్డా అనే ప్రోగ్రామ్ చేస్తోంది.
తన మాటలతో గానీ చేతలతో గానీ ఎవరనీ నోప్పించని సుమ ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. జయమ్మ పంచాయితీ (Jayamma Panchayathi) అంటూ వచ్చిన ఈ సినిమాలో నటించింది. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా సినిమాలు చేసినా.. ఆ తర్వాత యాంకరింగ్‌తోనే ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్‌కు యాంకరింగ్ చేస్తూ అలరిస్తూనే ఉంది.