కె.కోటపాడు,ఫిబ్రవరి20(ఆంధ్రపత్రిక):మండలంలోని లంకవానిపాలెం పి.హెచ్.సి.పరిధి వి.సంతపాలెం గ్రామంలో సోమవారం “ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టరు శైలజసురేష్ కుమార్ పలువురుకు షుగర్, బి.పి.టెస్టులు నిర్వహించారు. ఓపీలో 63 మందిని పరీక్షించారు. అలాగే మంచానపడ్డ ఏడుగురు రోగుల ఆరోగ్య స్థితిగతులను తనిఖీ చేశారు. స్కూల్, అంగన్వాడీకేంద్రాల విద్యార్థులు, చిన్నారుల ఆరోగ్యాన్ని పరీక్షించారు.ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ ప్రమీల, ఎం.పి.హెచ్.ఇ.ఒ.నాగేంద్ర హెచ్. ఎస్. జవ్వాది సన్యాసిరావు (చిన్న), ఎం.ఎల్. హెచ్.పి.మంగ,104 స్టాఫ్ రమణ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.