వేపాడ,నవంబర్,28( ఆంధ్ర పత్రిక):-
మండలంలోని సోంపురం సచివాలయం పరిధిలో బొద్దాం పిహెచ్సి వైద్యాధికారి అజయ్ కుమార్ సారథ్యంలో సోమవారం కుటుంబ వైద్యులు శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.హైపర్ టేషన్ కేసులు 76,షుగర్ వ్యాధిగ్రస్తులు 45 మంది,డయాలసిస్ రోగి,ఆంటీ నటల్,పోస్టు నటల్ తల్లులకు కౌన్సిలింగ్,రక్త పరీక్షలు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.అనంతరం ఆయన అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి గర్భిణీలకు,బాలింతలకు 4డి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.గ్రామంలోని 127 మంది రోగులు వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు.కార్యక్రమంలో ఎమ్.ఎల్.హెచ్. పి.వి.అరుణ్ కుమార్,ఎ.ఎన్.ఎం స్వప్న కుమారి, హెల్త్ అసిస్టెంట్ హెచ్.శేఖర్ బాబు,ఆశా కార్యకర్తలు శాంతి,వసంత తదితరులు పాల్గొన్నారు.