పొగమంచులా కమ్మేస్తున్న వాయు కాలుష్యం
భారత్‌లో మొత్తం 163 కాలుష్యనగరాల గుర్తింపు
321 ఇండెక్స్ చేరిన ఎయిర్ క్వాలిటీ
పొగ మంచులా కమ్మేస్తున్న వాయు కాలుష్యం
న్యూఢల్లీి,నవంబర్ 08 (ఆంధ్రపత్రిక): దేశ రాజధాని ఢల్లీిలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 321 చేరినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచులా వాయు కాలుష్యం కమ్మేసిందన్నారు. నోయిడా 354, గురుగ్రామ్ 326, ధీర్పూర్ 339, ఢల్లీి యూనివర్సిటీలో 336గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయింది. ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఢల్లీిలో స్కూల్స్‌కు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే రేపటి నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించింది. వాయు కాలుష్యం కాస్త తగ్గడంతో స్కూల్స్ తెరుస్తున్నట్లు తెలిపింది. రెండు రోజుల నుంచి చూస్తే ఎయిర్ క్వాలిటి మెరుగ్గా ఉందన్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 326 ఉండగా తాజాగా 321 నమోదైంది. అలాగే ప్రభుత్వ సంస్థలు కూడా ఓపెన్ కానున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. భారత్‌లో ఈ ఏడాది కాలుష్య స్థాయిలు మరింత దిగజారాయి. భారత్‌లో మొత్తం 163 నగరాలు కాలుష్య నిలయాలుగా మారాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ (సిపిసి) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నగరాల్లో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నట్లు సిపిసి పేర్కొంది. వాయు నాణ్యతా సూచీ (ఎక్యూఐ) అత్యధికంగా 360తో బీహార్‌లో కతిహార్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా ఢల్లీి, నొయిడా, ఘజియాబాద్, బీహార్‌లోని బెగుసరై, హర్యానాలోని బల్లాబ్‌ఘర్, ఫరీదాబాద్, ఖైతిహాల్, గురుగ్రామ్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్లు నిలిచాయి. వాహన కాలుష్యంతో పాటు పంటవ్యర్థాలను తగుల బెట్టడంతో కాలుష్య స్థాయిలు ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం ఒక్కరోజే పంజాబ్‌లో 3,634 పంట వ్యర్థాలను తగులబెట్టినట్లు ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ) పేర్కొంది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికమని వెల్లడిరచింది. విషవాయువులు ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపడమే కాకుండా శ్వాసకోస సమస్యలతో అకాల మరణాలకు దారితీస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 2017లో వాయు కాలుష్యం కారణంగా 1.2 మిలియన్లకు పైగా భారతీయులు అకాల మృత్యు బారిన పడినట్లు గ్రీన్‌పీస్ సంస్థ తెలిపింది.