గత కొంత కాలంగా ఎవరీ చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతోన్న ఫేక్ సర్టిఫికెట్ రాకెట్‌ను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చాకచక్యంగా అరెస్ట్ చేసింది. శనివారం సరూర్‌నగర్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన 64 నకిలీ సర్టిఫికెట్లు, ఇతర సంబంధిత మెటీరియల్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో అత్తాపూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహ్మద్ అఫ్రోజ్ సర్టిఫికెట్లను ఇతరులకు సరఫరా చేస్తున్నట్లు..
గత కొంత కాలంగా ఎవరీ చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతోన్న ఫేక్ సర్టిఫికెట్ రాకెట్‌ను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చాకచక్యంగా అరెస్ట్ చేసింది. శనివారం సరూర్‌నగర్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ యూనివర్సిటీలకు చెందిన 64 నకిలీ సర్టిఫికెట్లు, ఇతర సంబంధిత మెటీరియల్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో అత్తాపూర్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మహ్మద్ అఫ్రోజ్ సర్టిఫికెట్లను ఇతరులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు చిక్కడపల్లికి చెందిన కె మణికంఠ, రాయదుర్గంకు చెందిన వై రత్న కిషోర్, మహబూబ్‌నగర్‌కు చెందిన షాబాజ్ అలీఖాన్, కీసరకు చెందిన పి సుశీల్‌కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్‌కు చెందినఎ బాలకృష్ణతోపాటు ప్రధాన నింధితుడు ఢిల్లీకి చెందిన ఆశు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలు యూనివర్సిటీలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్‌ల నకిలీ సర్టిఫికెట్లను ప్రధాన నిందితుడు ఆశు సరఫరా చేస్తాన్నాడు. అశుకు కొన్ని రోజుల క్రితం అఫ్రోజ్‌కు పరిచయం ఏర్పడింది. మంచి లాభాలు వస్తాయని ఆశచూసిన అశు తన కోసం కస్టమర్లను తీసుకురావల్సిందిగా అఫ్రోజ్‌కు పురమాయించాడు. అందుకు నకిళీ సర్టిఫకెట్ల కోసం గాలిస్తున్న విద్యార్ధులను తన వద్దకు తీసుకురావల్సిందిగా కోరాడు. అందుకు తన వంతు వాటాను అందిస్తానని అశు నమ్మబలికాడు.
సులువుగా డబ్బు సంపాదించడానికి అఫ్రోజ్ ఈ ఒప్పందానికి అంగీకరించాడు. దీంతో ఆశు నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను సేకరించి రూ. 1 లక్ష నుంచి రూ. 3.5 లక్షల వరకు అమ్మి సొమ్ముచేసుకోసాగాడు. ఈ క్రమంలో స్కూల్ డ్రాపౌట్స్, ఫెయిల్ అయిన విద్యార్థుల సమాచారాన్ని సేకరించేవాడు. అనంతరం వారిని సంప్రదించి విదేశాలకు వెళ్లడానికి వీసా పొందడానికి నకిలీ సర్టిఫికేట్లు, ఇతర పత్రాలను అందజేస్తానని హామీ ఇచ్చేవాడు. అలా ఇప్పటి వరకు సుమారు 50 మంది విద్యార్థులకు పేక్ సర్టిఫికెట్లు అమ్మాడు. తద్వారా భారీ మొత్తంలో వసూలు చేశాడు. వీరి వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.