లెబనాన్: లెబనాన్ లో మళ్ళీ పేలుళ్లు జరిగాయి. వాకీ-టాకీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల పేలుడులో సుమారు 20 మంది మరణించగా, 450 మంది పైగా గాయపడ్డారని పైగా గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది..లెబనాన్లో జరిగిన పేలుళ్ల గురించి నేరుగా ప్రస్తావించకుండా ఇఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ బుధవారం ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడుతూ “మేము యుద్ధంలో కొత్త దశ ప్రారంభంలో ఉన్నాము – దీనికి ధైర్యం, సంకల్పం మరియు పట్టుదల అవసరం.” ఇజ్రాయెల్ సైన్యం మరియు భద్రతా సంస్థల పనిని ప్రశంసించాడు.
లెబనాన్ యొక్క విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ ఈ ఘటనపై మాట్లాడుతూ… “లెబనాన్ సార్వభౌమాధికారం, భద్రతపై కఠోరమైన దాడి” అని పేర్కొన్నారు. ఈ ప్రమాదకరమైన పరిణామం “విస్తృత యుద్ధానికి సంకేతం” అని హెచ్చరించారు. మంగళవారం పేజర్ల పేలుడులో 12 మంది మృతి చెందగా 2750 మంది గాయపడ్డారు.
అంతర్జాతీయ శాంతి అధ్యయనాల ప్రొఫెసర్ మేరీ ఎలెన్ ఓ’కానెల్ మాట్లాడుతూ… “అంతర్జాతీయ చట్టం ప్రకారం పౌరులు ఉపయోగించే వస్తువును ఆయుధాలుగా మార్చడం ఖచ్చితంగా నిషేధమని” పేర్కొంది.