పాట్నా,ఆగస్ట్16(ఆర్‌ఎన్‌ఎ): ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని పాత మిత్రులతో కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిఎం నితీశ్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు.ఇప్పటికే సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. తాజాగా కేబినెట్ విస్తరణ చేపట్టారు. 31 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన మంత్రుల చేత గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణం చేయించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఉన్నారు. బిహార్ కేబినెట్లో మొత్తం 36 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ తరుణంలో కేబినెట్లో తేజస్వియాదవ్ ఆర్జేడీకి 16, నితీశ్ కుమార్ జేడీయూకు 11 స్థానాలు కేటాయించారు. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా జితిన్ రామ్ మాంరీaకి, మరో ఇండిపెండెట్ అభ్యర్థికి సైతం కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో జెడియు హోంశాఖ, విద్య, భవన నిర్మాణం, మైనారిటీ వ్యవహారాలు, సాంఘిక సంక్షేమం, జలవనరుల శాఖలు దక్కించుకున్నది. ఇక ఆర్థిక, వాణిజ్య పన్నులు, ఆరోగ్యం, రోడ్డు నిర్మాణం, విపత్తు నిర్వహణ, పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖలు ఆర్జెడి దక్కించుకుంది. నితీష్‌కుమార్ బిజెపి మాదిరిగానే.. మహాఘట్బంధ్ కూటమికి మంత్రిపదవుల్ని ఇచ్చారని తెలుస్తోంది. ఆర్జెడి ` జెడియు పొత్తుతో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో నియమితులైన మంత్రులందరూ రాజ్‌భవన్‌లో మంగళవారం ఉదయం 11.30 ప్రమాణస్వీకారం చేయనునారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!