…… కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ కి అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బివి సత్యవతమ్మ వినతి పత్రం సమర్పణ…….. గ్రామీణ స్థాయిలో గ్రామాలలో రైతులకు సభ్యులకు అతి చేరువలో ఏర్పాటు చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వ్యవసాయ, పాడి రైతులకు, వ్యవసాయతర, కౌలు రైతులకు మహిళలకు జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ రుణాలు, రైతు పంటలు అవసరమగు విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు, సదరు పంటను కొనుగోలు ఇంకను నిత్యావసర వస్తువులు పంపిణీ , ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక్కరి కొరకు అందరూ అందరి కొరకు ఒక్కరు సహకార స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘ చట్టం 1964 ప్రకారం రిజిస్టర్ కాబడి బైలా ప్రకారం వచ్చిన లాభాలను సంఘ సభ్యులకు డివిడిండ్ల రూపంలోనూ, అనేక సాంఘిక కార్యక్రమాల అమలు పరుస్తూ సేవా కార్యక్రమాలు చేయుచున్నవి. చట్టప్రకారం సహకార శాఖ ఆడిటర్ డిపార్ట్మెంట్ వారి నుండి గాని ఫైనాన్సింగ్ బ్యాంకు నుండి గాని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి గాని ఎటువంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండా 2017 వ సంవత్సరం నుండి సహకార సంఘాలు రిటర్న్స్ ఫైల్ చేయనందున ఆయా సంఘాలు ఇన్కమ్ టాక్స్ మరియు పెనాల్టీలు లక్షలాది రూపాయలు చెల్లించవలసిందిగా కేంద్ర ప్రభుత్వ ఇన్కమ్ టాక్స్ వారి నుండి సంఘాలకు నోటీసులు ఇస్తూ ఒత్తిడి చేస్తున్నారు. మరియు సహకార సంఘాలు చేస్తున్న నగదు లావాదేవీల పై ఉన్న పరిమితులను మినహాయింపు మొదలగు విషయములపై విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి డివియస్ వర్మ ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు మరియు కార్యదర్శిలు అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బీవీ సత్యవతమ్మని కలిసి సహకార సంఘాలను ఇన్కమ్ టాక్స్ పరిధి నుండి మరియు సదరు నోటీసులకు వెసులుబాటు కల్పించవలసిందిగా జిల్లాలో గల సహకార సంఘాల యూనియన్ సభ్యులు వినతిపత్రం సమర్పించడమైనది.సదరు విన్నపములను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖామాత్యులు శ్రీమతి నిర్మల సీతారామన్ గారికి మన పార్లమెంటు సభ్యురాలు బివి సత్యవతమ్మ వివరించి న మీదట సానుకూలంగా స్పందించినట్లు తెలియజేశారు. సదరు వినతి పత్రంపై స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నందుకు మన పార్లమెంటు సభ్యురాలు బీవీ సత్యవతమ్మకి జిల్లా
కేంద్ర సహకార బ్యాంక్ సీఈవో డివిఎస్.వర్మ జిల్లాలో గల సంఘ అధ్యక్షులు జిల్లా యూనియన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు….
కోయిలాడ జగన్నాథరావు. అనకాపల్లి.ఆంధ్ర పత్రిక విలేకరి