ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణాలర్పించిన కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ,నవంబరు 1(ఆంధ్రపత్రిక): 67వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టరే ట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అమర జీవి పొట్టి శ్రీరాములు, జాతి పిత మహా త్మాగాంధీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఔన్నత్యానికి ప్రతి నిధిగా మొట్టమొదటి సారిగా బాషా ప్రయుక్త రాష్ట్రలకు నాంది పలికి 58 రోజుల పాటు అమరణ నిరాహర దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అమర జీవిగా నిలిచారని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని బాషా ప్రయుక్త రాష్ట్రల సాధనకు అహర్నిశలు కృషి చేశారన్నారు. తెలుగు వారందరిని ఒకే తాటి క్రిందకి తీసుకు రావాలనే తపనతో ఎంతో మంది మహానీయులు ఉద్యమాలు చేసారని, ఈ మహా యజ్ఞంలో ప్రముఖ గాంధేయవాది పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసారన్నారు. ఆ అమరజీవికి నేడు మనమంతా స్మృత్యంజలి ఘటించాలన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు త్యాగధ నుడు పొట్టి శ్రీరాములు ఘన కీర్తి విరజి ల్లుతునే ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపినపుడే త్యాగధ నులకు మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. పాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల వికేంద్రీకరణ చేపట్టి 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లా అభివృద్ధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి అన్ని రంగాలలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. ఈ కార్య క్రమంలో డిఆర్వో కె.మోహన కుమార్, కలెక్టరేట్ ఏవో ఇంతియాజ్ పాషా, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.