ఫ్రాన్స్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ లో రిత్విక్ రజిత పతకం గెలుచుకున్నాడు. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ డిజిటల్ మీడియా రిత్విక్ రజిత పతకం గెలిచినట్లు కథనం ప్రచురించింది.
ఈ కథనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. రాష్ట్రానికి చెందిన రాజారిత్విక్ ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ లో రజత పథకం గెలుచుకున్నాడని చెప్పారు. అతడికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ఫ్రాన్స్‌లో జరిగిన లాప్లాగ్నే ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ లో తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలుపొందిన రాజరిత్విక్ మన స్వంత యువ చెస్ స్టార్ అవ్వడం ఆనందంగా ఉందని సీఎం తెలిపాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్కి అభినందనలు తెలిపాడు. ఇక అతను టోర్నీలో అజేయంగా నిలిచాడని, ఛాంపియన్షిప్ టైటిల్‌ను కేవలం ఆఫ్ పాయింట్‌తో కోల్పోయాడని సీఎం రాసుకొచ్చారు.
అతడు ఇకముందు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ” ఫ్రాన్స్‌లో జరిగిన #లాప్లాగ్నే ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు సాధించి రజత పతకాన్ని గెలుపొందిన మా స్వంత యువ #చెస్ స్టార్ #రాజరిత్విక్ను చూసి సంతోషిస్తున్నాను.
మంథని, పెద్దపల్లికి చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్‌ను నేను అభినందిస్తున్నాను. అతను టోర్నీలో అజేయంగా నిలిచాడు మరియు ఛాంపియన్షిప్ టైటిల్‌ను కేవలం సగం పాయింట్‌తో కోల్పోయాడు. అతనికి మంచి జరగాలని కోరుకుంటూ, అతని ముందున్న ప్రయాణంలో అందరి సహాయానికి హామీ ఇస్తున్నాను” అని సీఎం ట్వీట్ చేశారు.