నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది.అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది.మాధవిలత తన ఫేస్‌బుక్ పేజీలో రాస్తూ..’ నేను ఒక వ్యక్తిని కలిశా. ముందు అతడిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రెండువైపుల తల్లిదండ్రుల అనుమతి పొందాలి. ఇది అంత త్వరగా జరిగే పని కాదు. మరో ఏడాది సమయం పట్టొచ్చు. అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెబుతా. అయితే పెళ్లి తేదీ గురించి మాత్రం అడగొద్దు. అయితే అసలు అతడు తెలుగువ్యక్తి అయితే కాదు. నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే’ అంటూ పోస్ట్ చేశారు. కాగా.. 2018లో రాజకీయాల్లో ప్రవేశించింది. బీజేపీలో చేరిన ఆమె గత ఎన్నికల్లో పోటీ కూడా చేసింది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!