ఎన్టీఆర్ అభిమానుల్లో ఆతురత
జక్కన్న ఆర్ఆర్ఆర్ కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరల్డ్ వైడ్ గా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉత్తమ నటుడిగా అస్కార్ గ్యారంటీ అనే వార్తలు వినిపించాయి. ’కొమురం భీముడో’ సాంగ్ కు సంబంధించిన సీన్ లో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకు గానూ తనకు ఆస్కార్ గ్యారెంటీ అని అంతా భావించారు.కానీ ఎన్టీఆర్ కనీసం ఆస్కార్ బరిలో నామినేషన్ ని సాధించలేకపోయాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆస్కార్ అవకాశం చేజారిందే అంటూ నిట్టూర్చారు. ఎన్టీఆర్ అభిమానుల దృష్టి ఇప్పుడు నేషనల్ అవార్డ్ పై పడిరది. ఇప్పుడు అభిమానుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.’కొమురం భీముడో’ పాటకు ముందు పాట సమయంలో ఎన్టీఆర్ పలికించిన హావ భావాలు ప్రతీ ఒక్కరినీ అబ్బుర పరిచిన విషయం తెలిసిందే. ఈ సన్నివేశాలే ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ ని తెచ్చి పెడతాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయినా కన్నడ హీరో విషయంలో మాత్రం అభిమానులు భయపడుతున్నారట. ఆ కన్నడ హీరో మరెవరో కాదు రిషబ్ శెట్టి. ’కాంతార’ మూవీలోని చివరి 20 నిమిషాల్లో రిషబ్ శెట్టి ప్రదర్శించిన నటన ప్రతీ ఒక్కరికి గూస్ బంప్స్ ని తెప్పించి అబ్బుర పరిచింది. రీసెంట్ గా ముంబాయిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుక జరిగింది. ఇందులో రిషబ్ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా ’కాంతార’ మూవీకి గానూ అవార్డుని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్రిటిక్స్ కొంత మంది రిషబ్ పై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా రిషబ్ కు 2022 కు గానూ ఉత్తమ నటుడిగా పలు అవార్డులు దక్కాలంటూ కోరుకున్నారట. ఈ నేపథ్యంలోనే రిషబ్ కు పెరుగుతున్న ఆదరణ జాతీయ స్థాయిలో అతన్ని రికమెండ్ చేస్తున్న తీరు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని కలవరానికి గురిచేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కంటె కేంద్ర ప్రభుత్వం ’కాంతార’కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా సంకేతాలు అందుతుండటం ఆస్కార్‌కు ఆర్ఆర్ఆర్ ని రికమెండ్ చేయకపోవడంతో ఎన్టీఆర్ కు నేషనల్ అవార్డ్ కష్టమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!