తెలంగాణ బీజేపీలో ముసలం ముదురుతూనే ఉంది. బీజేపీ లీడర్ జితేందర్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో రాజకీయంగా అలజడి రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలోకి ఎక్కించేందుకు దున్నపోతను తంతాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన జితేందర్ రెడ్డి.. ‘తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం’ అంటూ రాసుకొచ్చారు…
తెలంగాణ బీజేపీలో ముసలం ముదురుతూనే ఉంది. బీజేపీ లీడర్ జితేందర్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో రాజకీయంగా అలజడి రేపిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఓ వ్యక్తి దున్నపోతును ట్రాలీలోకి ఎక్కించేందుకు దున్నపోతను తంతాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన జితేందర్ రెడ్డి.. ‘తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం’ అంటూ రాసుకొచ్చారు. దీంతో జితేందర్ ఇది ఎవరిని ఉద్దేశించి పోస్ట్ చేశాడంటూ చర్చ జరిగింది. ఈ ట్వీట్‌ను జితేందర్ రెడ్డి అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలకు ట్యాగ్ చేయడంతో ఈ విషయం మరింత కాంట్రవర్సీగా మారింది.
జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన జితేందర్ ట్వీట్‌పై రెస్పాండ్ అయ్యారు. జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశ్యం ఏంటో ఆయననే అడగాలి అంటూనే చురకలు అంటించారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. ఎవరి స్వేచ్ఛ, గౌర్వం తగ్గకూడదన్న ఈటల.. ఏదీ పడితే అది మాట్లాడకూడదని హితవు పలికారు. ఎవరి గౌరవానికీ భంగం కలగకుండా చూసుకోవాలని సూచించారు.
దీంతో తెలంగాణ బీజేపీలో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఉంటుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నాయకులు కొట్టిపారేస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో కేంద్రం చేపట్టనున్న మంత్రి వర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ బీజేపీలో పలు మార్పులు జరగడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.