న్యూఢల్లీి,డిసెంబర్ 1 (ఆంధ్రపత్రిక): సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడో సారి కావడం గమనార్హం. జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం నియమిం చారు. గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివాహ వివాదాలకు సంబంధించిన 10 బదిలీ పిటిషన్లు, పది బెయిల్ పిటిషన్లను విచారించ నున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు ఉండగా, ముగ్గురు మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. వారు జస్టిస్ హిమా కొహ్లీ, బి.వి. నాగరత్న, జస్టిస్ త్రివేదిలు. వీరిలో జస్టిస్ కొహ్లీ పదవీకాలం సెప్టెంబర్ 2024తో ముగియ నుంది. జస్టిస్త్రివేది పదవీకాలం 2025వరకు ఉంది. జస్టిస్ నాగరత్న పదవీకాలం 2027 వరకు ఉండగా, ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో కూడా ఉన్నారు. 2027లో ఆమె 36రోజుల పాటు సిజెఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అప్పుడు సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఘనతను సాధిస్తారు. 2013లో మొదటిసారి జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశారులతో సుప్రీంకోర్టులో మహిళా బెంచ్ ఏర్పాటైంది. 2018 సెప్టెంబర్ 5న జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో రెండో సారి ధర్మాసనం ఏర్పాటై పలు విచారణలు చేపట్టింది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!