మునగపాక, నవంబర్ 1 (ఆంధ్రపత్రిక) : మండలంలోని నాగులపల్లి జగ్గయ్యపేట అగ్రహారంలో శ్రీరామలింగేశ్వర దేవస్థా నంలో మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవ ర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు.ఈ కార్యవర్గం అధ్యక్షునిగా కొడమంచిలి దక్షిణేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా చల్లపల్లి అచ్యుత రావు, కార్యదర్శిగా జొన్నాడు సతీష్, కోశాధి కారిగా కాజులూరు శంకర్రావు,సలహాదారులుగా సిరిపల్లి సోమ నాయుడు, కొడమం చిలి అప్పారావులను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గ సమావేశం ఎంపికకు మండలం ఇది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
పి.వి.పాలెంలో ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్యసేవలు
కె.కోటపాడు, నవంబర్ 1 (అంధ్రపత్రిక) : వైద్య సేవలను గ్రామ,గ్రామానికి ఇంటింటికి విస్తరించాలనే ‘‘ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్’’ కార్యక్రమాన్ని అవసరమై నవారు వినియోగించుకోవాలని మండల పరిషత్ ఉపాధ్య క్షులు రొంగలి సూర్యనారాయణ అన్నారు. మండలం లోని చౌడవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి పాచిలవానిపాలెంలో మంగళవారం ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్-ఎంపీపీ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం సూక్తిని గుర్తుఎరిగి అందుబాటులోకి వచ్చిన వైద్య సేవలను ఉపయోగించుకోవాలన్నారు. పి.హెచ్.సి. డాక్టరు సుబ్రహ్మణ్యం సుమారు 90 మందిని పరీక్షించారు. వైద్యసేవలు, మందులు అందించారు. అలాగే స్కూల్, అంగన్వాడి కేంద్రం, పలు ఇళ్లను సందర్శించారు.వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.హెచ్.ఇ.ఒ. రాజశేఖర్, హెల్త్ ఎడ్యుకేటర్ టి.ఎస్.ఎన్. మూర్తి, సూపర్వైజర్లు రాము, సన్యాశమ్మ ఎం.ఎల్. హెచ్.పి.లు మాధవి, సౌమ్య, పావని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.