ఇటీవల టమాటా ధరలు రైతులకు కాసులు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టమాటాతో సహా మిగతా కూరగాయల ధరలు కూడా సాధారణ స్థితికి వచ్చేశాయి. అయితే ప్రస్తుతం కందిపప్పు, బియ్యం వంటి నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. అలాగే జీలకర్ర, పాలు వంటి ధరల పెరుగుదల చూసి ప్రజలు హడలిపోతున్నారు. ఇలా నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల టమాటా ధరలు రైతులకు కాసులు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టమాటాతో సహా మిగతా కూరగాయల ధరలు కూడా సాధారణ స్థితికి వచ్చేశాయి. అయితే ప్రస్తుతం కందిపప్పు, బియ్యం వంటి నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. అలాగే జీలకర్ర, పాలు వంటి ధరల పెరుగుదల చూసి ప్రజలు హడలిపోతున్నారు. ఇలా నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో అకాల వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ కారణం వల్లే ధరలు మండిపోతున్నాయని వర్తకులు చెబుతున్నారు. అలాగే ప్రొటీన్ ఎక్కువగాలభించే కందిపప్పును కూడా తెలుగు ప్రజలు ప్రతిరోజూ వినియోగిస్తుంటారు. ప్రస్తుతం కందిపప్పు కిలో ధర ఆరు నెలల్లోనే దాదాపు 50 శాతం పెరిగిపోయింది. వాస్తవానికి ఫిబ్రవరిలో 110 రూపాయల నుంచి 120 రూపాయలు ఉంది. అయితే ఇప్పుడు మాత్రం 170 రూపాయలకు చేరింది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే తెలంగాణకు మహారాష్ట్ర నుంచి అధికంగా కందిపప్పు వస్తుంది. అయితే అక్కడ వర్షాలు పడలేదు.దీంతో దిగుబడి తగ్గిందని హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్లో ఉన్న వర్తకులు అంటున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు కందిపప్పుకు ప్రత్యామ్నాయంగా పెసర, ఎర్రపప్పులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మినుప పప్పు ధరల కిలోకు 110 రూపాయల నుంచి 130 రూపాయలకు పెరిగిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జీలకర్ర 700 రూపాయలకు పైగా పలుకుతోంది. అయితే అయిదారు నెలల క్రితం చూసుకుంటే దీని ధర 300 రూపాయల లోపే ఉండేంది. అలాగే సెనగపప్పు ధర 65 రూపాయల నుంచి 75-80 రూపాయలకు ఎగబాకింది. పాలు లీటర్కు ఏకంగా ఐదు రూపాయల చొప్పున పెంచేశారు.నాణ్యమైనవి చూసుకుంటే 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతోంది.
ఇక చింతపండు చూసుకుంటే ఇది కిలోకు 120 నుంచి 150 రూపాయలకు చేరిపోయింది. మరో విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చింతచెట్లు గతంలో చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అంతగా లేకపోవడం అలాగే కోతుల సమస్యల వల్ల కూడా వాటిని కొట్టేస్తున్నారు. దీనివల్ల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోతోంది. ఇక వంట నూనెలు, అల్లం వెల్లుల్లి ధరలు మాత్రం ప్రజలకు కాస్త ఉపశమనంగా ఉంది. వారం రోజుల క్రితం చూసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు కిలో 280 రూపాయలు పలికింది. అయితే ఇప్పుడు మాత్రం180 రూపాయలకు దిగివచ్చింది.2019లో లీటర్కు 90 రూపాయలు ఉన్న మంచినూనె ధర.. ఆ తర్వాత 190 రూపాయలకు వెళ్లిన సందర్భం ఉంది. ప్రస్తుతం దీన్ని కిలోకు 110 రూపాలకు విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా బియ్యం ధరలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. 25 కిలోలు ఉన్న సన్నబియ్యం బస్తా 1250 రూపాయల నుంచి 1500 రూపాయలకు పెరిగిపోయింది. నాణ్యమైనవి కిలో 54 రూపాయల 64 రూపాయలకు పెరిగిపోయాయి. అకాల వర్షాల వల్ల పంట నష్టం.. అలాగే రైతుల దొడ్డు రకం వరి సాగుకే ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలే ఈ పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి.