కదం తొక్కిన కామ్రేడ్లు
‘పుల’కించిన నగరం కిలోమీటర్ల పొడవునా సాగిన ప్రదర్శన
నినాదాలతో హోరెత్తిన నగర వీధులు
విజయవాడ,అక్టోబర్ 14 (ఆంధ్రపత్రిక): పాలకుల విధానాలను ఎండగట్టిన పార్టీ శ్రేణులు అరుణపరాక రెపరెపలతో విజయవాడ నగరం పులకించిపోయింది. విప్లవాల పురిటిగడ్డ మరోమారు ఎరుపెక్కింది. వేలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు కదం తొక్కుతూ ముందుకు సాగారు. మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వర్యాన్ని సైతం లెక్కచేయకుండా మొక్కవోని పట్టుదలతో ముందుకు నడిచారు. సీపీఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనను నగర ప్రజానీకం ఆసక్తితో తిలకించింది. తప్పట్లు, తాళాలు, డప్పు వాయిద్యాలు, విప్లవగేయాలతో ప్రదర్శన ఎంతో కోలాహలంగా ముందుకు సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీపీఐ, అనుబంధ ప్రజా సంఘాల కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా ప్రదర్శనలో పాల్గొన్నారు. సీపీఐ జిందాబాద్, విప్లవం వర్గీల్లాలి, ఎరుపులోన మెరుపుంది, పోరాడే శక్తి ఉందంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టుతూ ప్లజార్డులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. తమ తమ జిల్లాల బ్యానర్లను చేబూని ఉక్కు క్రమ శిక్షణతో వరుస క్రమంలో ముందుకు సాగారు. యువకులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చివరకు చిన్నపిల్లలు సైతం పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వందలాది మహిళలు ఎర్ర అంచు తెల్లచీరలు, యువ మహిళలు ఎర్ర తల్వార్, తెల్ల పైజామా ధరించారు. వేలాది మంది ఎర్ర బొక్కలు ధరించి పాల్గొనడంతో కనుచూపుమేర ఎరుపుమయమైంది. కిలోమీటర్ల పొడవునా ప్రదర్శన సాగింది. బీజ టీఎస్ ధోడు చివర పండ్ల మార్కెట్ దగ్గర నుంచి
ప్రారంభమైన ఈ ప్రదర్శన సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, గవర్నమెంటు ప్రెస్ సెంటర్, సింగ్ నగర్ పైఓవర్డ్ మీదుగా డాబా కొట్ల సెంటర్ గుండా ఖమరజీవి చంద్ర రాజేశ్వరరావు మైదానం (మాకినేని బసవపున్నయ్య స్టేడియం)కు చేరుకుంది. కేరళ, తమిళనాడు, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, తిరుపతి నుండి ప్రత్యేక రైళ్ల ద్వారా సీపీలు శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్ళు, బస్సులు, లారీలు, కార్లు, తదితర వందలాది వాహనాల్లో కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దీంతో తెల్లవారురaాము నుంచే విజయవాడ నగర విధులు కిక్కిరిసిపోయాయి. నగరంలో ఏ వీధి చూసినా కామ్రేడ్ల సందడే కనిపించింది. నది అన్నం, పులిహోర, చపాతీలు వంటి స్వగృహ వంటలను మూటగట్టుకుని అనేక మంది మహిళలు ఉదయాన్నే నగరానికి చేరుకోవడం పార్టీ పట్ల వారి నిబద్ధతకు నిదర్శనంగా కనిపించింది. అలాగే కొంతమంది మహిళలు పసిబిడ్డలను చంకనెత్తుకొని, నెత్తిన సద్ది మూట పెట్టుకుని విప్లవ నినాదాలతో ప్రదర్శనలో హుషారుగా పాల్గొనడం యువతకు స్పూర్తినిచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు రోడ్ల పక్కన కూర్చుని భోజనాలు చేసి పార్టీ పట్ల తమకున్న అంకితభావాన్ని చాటారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుండి గిరిజనులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రదర్శన ఆగ్రభాగాన వేలాది మంది యువ రెషర్ట్ వాలంటీర్లు, యువ మహిళలు అరుణ పతాకాలతో ముందుకు సాగగా, ఆ తర్వాత వేలల్లో జన సేవాదళ్ కార్యకర్తలు కదంతొక్కారు. వారి వెనుక వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, కార్యకర్తలు వరుస క్రమంలో ప్రదర్శనలో పాల్గొన్నారు. మహిళలు దాదాపు 120 అడుగుల అతి పెద్ద బ్యానరన్ను పట్టుకుని ప్రదర్శన ఆగ్రభాగాన పాల్గొనడం చూపరులను ఆకర్షించింది. ప్రదర్శన ఆగ్రభాగాన సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ, అతుల్ కుమార్ అంజన్, పల్లవ్ సేన్ గుప్తా, అనీ రాజా, వినయ్ విత్వం, అమరత్ కౌర్, బాలచందర్ కాంగో, సంతోష్ కుమార్, చాడా వెంకట రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ పార్టీ సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, డేవిఎస్ఎన్ మూర్పి రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ తదితరులు నడవగా… నగర ప్రజానీకం రోడ్డుకిరువైపులా పెద్దసంఖ్యలో నిలబడి దారి పొడవునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. సింగ్ నగర్ రింగు వద్ద సీపీఎం నాయకులు సౌహార్య స్వాగతం పలికి సంఫీుభావం తెలిపారు.