సంస్కరణలతో మారుతున్న విద్యారంగం
నిధుల కేటాయింపుతో స్కూళ్ల రూపురేఖలు
అమరావతి,ఫిబ్రవరి 13 (ఆంధ్రపత్రిక) : ఎపిలో విద్యారంగంలో సంస్కరణలకు సిఎం జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. సామాన్యులకు విద్యను చేరువచేసే లక్ష్యంతో అనేక విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనేక పథకాలతో విద్యార్థులకు అండగా నిలవాలని చూస్తోంది. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలన్నీ పూర్తిగా మార్చేందుకు మనబడి నాడు`నేడు కార్యక్రమం అమలు చేస్తున్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని స్కూళ్ల రూపు రేఖలు మార్చబోయే కార్యక్రమం ఇది. మధ్యాహ్న భోజనం మెనూలో కూడా పూర్తిగా మార్పులు చేస్తూ.. గోరుముద్ద అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. దీనివల్ల అదనంగా దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతి పిల్లాడిని చదివించడమే కాదు.. వారు భావితరంతో పోటీ పడాలన్న లక్ష్యం మేరకు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ ళాశాలల రూపురేఖలు మార్చబోతున్నట్లు సిఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అంతర్జాతీయంగా పోటీపడే పరిస్థితి రావాలని అది జరగాలంటే ప్రతి స్కూల్ ఇంగ్లిష్ విూడియం వైపు పరుగెత్తాలన్న సంకల్పంతో సిఎం జగన్ ఉన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ పూర్తిగా ఇంగ్లిష్ విూడియం ప్రవేశపెట్ట బోతున్నారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ మొత్తంగా నాలుగేళ్లలో బోర్డు ఎగ్జామ్‌ను ఇంగ్లిష్ విూడియంలో రాసే పరిస్థితి కల్పిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా పిల్లలకు బ్రిడ్జి కోర్సులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించారు. వీటన్నింటితో పాటు తెలుగును తప్పనిసరి స్జబెక్టుగా తీసుకొస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఎపిలో విద్యారంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో కార్పోరేట్ స్కూళ్ల ఫీజు దోపిడీకి కళ్లెం పడనుంది. వేలకోట్లు ప్రజల నుంచి పీలుస్తున్న విద్యాసంస్థలకు ముకుతాడు పడనుంది. ప్రభుత్వమే నాణ్యమైన విద్యను,ఇంగ్లీష్ విూడియాన్ని ప్రకటించినందున ఇక ఎపిలో విద్యారంగంలో విప్లవం రాకమానదు. ప్రయివేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటా కింద భర్తీ చేసే ప్రతిపాదనలపై పలు సూచనలు చేశారు. ఎయిడెడ్ కాలేజీల నిర్వహణ పూర్తిగా ఇటు ప్రభుత్వ యాజమాన్యంలో, లేక అటు ప్రయివేటు యాజమాన్యాల చేతిలో ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!