హైదరాబాద్: ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర కాసేపటి క్రితమే ముగిసింది. బడా గణేశ్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన క్రేన్-4 వద్దకు చేరుకున్నాడు.
అశేష జనవాహిని తోడు రాగా గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. కాసేపట్లో వినాయకుడి విగ్రహాన్ని భారీ క్రేన్ తో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సుమారు గంట సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.