న్యూయార్క్,నవంబర్ 14 (ఆంధ్రపత్రిక): ఎలన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు, టెక్ సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్ నుంచి తొలగించాడు. ఉద్యోగుల తొలగింపు పక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విటర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలన్ మాస్క్ ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం మరికొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినట్లు తెలు స్తోంది. ట్విట్టర్‌లోని ఔట్ సోర్సింగ్ విభాగంలో భారీగా లే ఆఫ్ లు ప్రకటించారు. దాదాపు 5,500 మందికిపైగా ఉద్యోగుల్లో 4,400 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. వాళ్లలో ట్విటర్ కు చెందిన కంటెంట్ మాడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే, తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, శనివారం రోజు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చి జాబ్‌లో నుంచి తొలగించారని ఉద్యోగులు చెబుతున్నారు. వాళ్లలో చాలామందికి సిస్టమ్స్‌లో లాగిన్ యాక్సెస్ కోల్పోయాకే ఉద్యోగాలు పోయినట్టు తెలిసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు పక్రియ కంపెనీ డైరెక్టర్లకు, మేనేజర్లకు కూడా తెలియదట.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!