కృష్ణాజిల్లా..
అవనిగడ్డ నియోజకవర్గం..
చల్లపల్లి మండలం చింతలమడ రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం పేరుతో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కుట్రపూరితంగా దీక్ష చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మండిపడ్డారు..
మోపిదేవి మండలం రావివారిపాలెం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
అనంతరంటిడిపి నాయకులు , కార్యకర్తలు ను అడ్డు పెట్టుకొని మండలిబుద్ధప్రసాద్ చేసిన సత్యాగ్రహ దీక్ష పై మోపిదేవిలో ఎమ్మెల్యే స్పందించారు. చింతలమడ వాసులు రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే సహాయం కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ వ్రాసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలో సహాయం మంజూరవుతుందని సంకేతాలు రావటంతో కష్టాల్లో ఉన్న బాధితులను వాడుకుని రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ దీక్ష చేపట్టారని విమర్శించారు.
ఎస్సీలపై అంత ప్రేమ ఉంటే బోడగుంట అగ్ని ప్రమాద బాధితులకు ఏం సహాయం చేశారని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం బుద్ధప్రసాదుకు అలవాటే అన్నారు. సీఎం సభ ముందు కోడూరు పొలాల వద్ద హడావుడి ఇలాంటిదేనన్నారు. చింతలమడ బాధితులను అడ్డు పెట్టుకుని ఎస్సీల్లో చీలిక తేవాలని బుద్ధప్రసాద్ చేస్తున్న కుట్రలు చెల్లవని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్మోహనరెడ్డిపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. చింతలమడ బాధితులకు ప్రభుత్వ సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.