పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓర్వలేకపోతున్నారని, అందుకే అభివృద్ధిని అడ్డుకునే ప్రయ త్నం చేస్తూ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లా డారు.పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు.. అభివృద్ధిని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అవకాశం ఇచ్చినా ఆయన ఏం చేయలేకపోయారు. కానీ, ఇప్పుడు మేం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం. వనరుల్ని గుర్తించి.. రాష్ట్రాన్ని దేశవిదేశాలకు ప్రమోట్ చేస్తున్నాం. అయినా కూడా భరించలేక ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటలకు, చేసిన ఎంవోయూలకు పొంతనే లేదని విమర్శించారు మంత్రి అమర్నాథ్. టీడీపీ ఒక డ్రామా కంపెనీ అని అభివర్ణించిన మంత్రి అమర్నాథ్.. నేపాల్ గుర్ఖాలకు సూటూ బూటూ తగిలించి ఎంవోయూలు చేసిన ఘనత చంద్రబాబుదని, అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒకవైపు తాము అభివృద్ధి చేస్తుంటే.. ప్రతీది తామే చేశామంటూ చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని, ప్రజలు అంతా గమనిస్తుంటారని చంద్రబాబు, నారా లోకేష్లకు హితవు పలికారు.అసలు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మీ(చంద్రబాబు) హయాంలో ఎందుకు ఉపయోగించలేదు..?. అసలు ఐదేళ్లలో అసలు మీరు ఏమీ చేసారో చెప్పండి. సమ్మిట్ల పేరుతో డ్రామా చేయడం తప్ప మీరు చేసింది ఏమిటి..?. మీరు చేసిన ఎమ్ఓయూలకు ఒక్కసారి సమాధానం చెప్పగలరా..? ఒక్క ఫోన్ కాల్ తో ప్రతి సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు.
టీడీపీని కాపాడడం పవన్ బాధ్యత
మోదీ దగ్గర వేషాలు వేసే తత్వం పవన్ కళ్యాణ్ది అని, అదసలు కాపుల పార్టీ కాదని, కమ్మ జనసేన అని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ‘పార్టీని నడుపుతున్నది నాదెండ్ల మనోహర్ కాదా?. ఈ రాష్ట్రంలోని కాపులు జనసేనను మీదేసుకునే పరిస్థితి లేదు. దమ్ముంటే 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తాం అని చెప్పమనండి. అసలు పవన్ కళ్యాణ్ బాధ్యత వైజాగ్ ను కాపాడటం కోసం కాదు…టీడీపీనీ కాపాడటం ఆయన బాధ్యత అంటూ చురకలు అంటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వడంలో మేం రాజీపడడం లేదు. ఎంఎస్ఎంఈలకు పాత బకాయిలు కూడా ఇస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి, సంతోషం అనే నాలుగు స్థంబాల మీద సీఎం జగన్ పాలన కొనసాగుతోందని, పరిశ్రమల ఏర్పాటు.. ఉపాధి కల్పన ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!