తూర్పు గోదావరి జిల్లా, డిసెంబర్ 2ఆంధ్రపత్రిక )…
హోరాహోరీగా ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాలు హస్తానికి, మరో రెండు రాష్ట్రాలు కమలానికి చేజిక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తెలంగాణా, చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ కు మొగ్గు ఉంటుందని లెక్కగట్టాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో మాత్రం కమలం వికసిస్తుందన్నాయి. మిజోరంలో జొరాం పీపుల్స్ మూవ్మెంట్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య నువ్వానేనా అనే వాతావరణం నెలకొందని ఎగ్జిట్పోల్స్ ప్రకటించాయి. ఆ తరువాత స్థానంలో కాంగ్రెస్, భాజపాలు నిలుస్తాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రధానంగా తెలంగాణాలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సుమారు 12 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటించాయి. ఇదే మాదిరిగా తెలంగాణాలో కెసిఆర్ ఓటమితో కాంగ్రెస్ వస్తే ఆంధ్రాలో ఇదే మాదిరిగా వైకాపా స్థానంలో తెదేపాకు అవకాశం దక్కుతుందనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఆంధ్రరాష్ట్రంలోని ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజకీయాలు కూడా వేగవంతంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటినుండే తమ విశ్లేషనలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే రాజమండ్రి పార్లమెంట్ సీటు కమ్మ సామాజికి వర్గానికే కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది. ఒక వేళ కమ్మ సామాజికి వర్గానికి కేటాయిస్తే ప్రముఖ రాజకీయ నాయకులు, దివంగత నాయకులు బొడ్డు భాస్కరరావు కుమారుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి, రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అలాగే ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎన్ఆర్ఐ, తెలుగుదేశం పార్టీ జోన్-2 కోఆర్డినేటర్ మందలపు రవి కూడా రాజమండ్రి పార్లమెంట్ సీటుపై కన్నేసినట్లు తెలుస్తుంది. ఇక గతంలో మహానాడు వేదికగా తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధికి 25 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శిస్టులా లోహిత్ కూడా రాజమండ్రి ఎంపీ బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాజానగరం తెదేపా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న బొడ్డు వెంకట రమణ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని ఎదుర్కోవలసి ఉంది. అయితే ఎంతో ఆర్ధిక పరిపుష్ఠిత కలిగిన బొడ్డు డబ్బు ఖర్చు విషయంలో ఆలోచించే పనిలేదు. అయితే జక్కంపూడి రాజా కాపు సామాజికి వర్గానికి చెందిన వైకాపా అభ్యర్ధి కావడంతో ఇదే నియోజకవర్గంలో అదే కాపు సామాజికి వర్గానికి చెందిన జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణకు సీటు ఇస్తే కాపు సామాజిక వర్గంలోని ఓట్లను సంపాదించడంతో పాటు ఇటు తెదేపా కేడర్ కూడా బత్తులకు మద్దతు ఇచ్చే అవకాసం ఉంటుందని, ఈ మేరకు జనసేన, తెదేపా పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ ని కూడా రాజానగరం సీటు జనసేనకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జనసేన కార్యకర్తలు పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా రాజానగరం సీటు జనసేన అభ్యర్థి బత్తులకు కేటాయిస్తే మాత్రం బొడ్డు వెంకట రమణ చౌదరికి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం దక్కవచ్చని తెదేపా నాయకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే యువనాయకుడైన శిష్ట్లా లోహిత్ రాజమండ్రిలో ఇటీవల జరిగిన మహానాడు వేదికగానే స్థానికులకు సుపరిచితుడయ్యాడు. ఇక్కడ రాజకీయంగా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతోనే రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగానే సుమారు 25లక్షల రూపాయలు తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధికి ప్రకటించారు. లోహిత్ రాజమండ్రి పార్లమెంట్ సీటు కోసం ఇప్పటికే విఎల్ పురంలో పార్టీ కార్యాలయానికి కూడా ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధంచేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల పార్టీ కార్యాలయ ప్రతిపాదనను శిష్యా లోహిత్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా రాజమండ్రి రూరల్ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆశిస్తున్నటప్పటికీ జనసేన, తెదేపా పొత్తు కారణంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ సీటు కేటాయిస్తే గనుక బుచ్చయ్య చౌదరికి సముచిత స్థానం కల్పించే అవకాసం ఉందని, ఇదే సమయంలో కమ్మ సామాజికి వర్గానికి ప్రాధాన్యత కల్పించాలంటే ఎంపీ సీటుతో కమ్మ సామాజిక వర్గంతో భర్తీ చేస్తారనే, ఈ కారణం చేత బొడ్డు వెంకట రమణ చౌదరికి రాజమండ్రి ఎంపీ అభ్యర్ధిగా అవకాసం ఉండవచ్చని తెదేపా నాయకులే చెబుతున్నారు. ఏది ఏమైనన్పటికీ ఎగ్జిట్ పోల్ తో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజమహేంద్రవరం పార్లమెంట్ సీట్ కి పోటీ పెరుగుతుందని చెప్పకతప్పదు…
ముగ్గురూ శ్రీమంతులే..
రాజమండ్రి పార్టమెంట్ సీట్ ని ఆశించే తెదేపా అభ్యర్థుల్లో బొడ్డు వెంకట రమణ చౌదరి, శిష్యా లోహిత్, మందలపు రవి ఈ ముగ్గురూ కూడా ఎంతో ఆర్ధిక పరిపుష్టిత కలిగిన యువ నేతలే.. వీరిలో ఒక్కొక్కరూ విడివిడిగా 100కోట్ల రూపాయలకు పైగా సునాయాసంగా ఎన్నికల్లో ఖర్చుచేయగల సమర్థులే…. ఇప్పటికే వీరు పార్టీపరంగా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నవారే… అయితే వీరు ముగ్గురూ కూడా రాజమండ్రికి స్థానికేతరులే. అయితే గతంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ ప్రాంతమంతా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాగా పేరు మారింది. కాని ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రాంతమంతా తూర్పు గోదావరి జిల్లా గా ఉంది. ఇప్పటివరకూ రాజమండ్రి పార్లమెంట్ నియోజవర్గానికి ఎంపికయిన ఎంపీలందరూ 90శాతం స్థానికేతరులే. అయితే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంతో విజ్ఞతతో ప్రవర్తిస్తారనే నానుడి కూడా ఉంది. స్థానికుడా, స్థానికేతరుడా, ఏ పార్టీకి చెందిన అభ్యర్ధా అని చూడకుండా సరైన అభ్యర్థిని ఎంపికచేసే రాజకీయ చతురత కూడా గోదావరి ప్రాంత ఓటర్లకు ఉందని చెప్పకతప్పదు. అందుకే అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. మొదటి సోషల్ లిస్ట్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఓటర్లు గెలిపించారు.అనంతరం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని తదనంతరం కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైకాపా వంటి పార్టీ అభ్యర్థులకు కూడా ఇక్కడ అవకాశం కల్పించారంటే ఈ ప్రాంత ఓటర్లకు రాజకీయ చైతన్యం కూడా ఎక్కువనే చెప్పాల్సి ఉంది.
గతంలో రాజమండి ఎంపీలుగా ఎన్నికైన అభ్యర్థులు వీరే….
ఎన్నికైన సంవత్సరం ..ఎంపీ పార్టీ
2019 మార్గాని భరత్ రామ్. వైఎస్ఆర్ కాంగ్రెస్..
2014 మాగంటి మురళీమోహన్..తెలుగుదేశం పార్టీ..
2009…ఉండవల్లి అరుణ్ కుమార్…కాంగ్రెస్
2004..ఉండవల్లి అరుణ్ కుమార్..కాంగ్రెస్
1999..ఎస్ బిపిబికె. సత్యనారాయణరావు
బీజేపీ.
1998..గిరిజాల వెంకట స్వామినాయుడు..బీజేపీ…..
1996..చిట్టూరి రవీంద్ర…కాంగ్రెస్
1991..కె.వి.ఆర్.చౌదరి… తెదేపా
1989..జమున, బిజెపి…కాంగ్రెస్
1984…చుండ్రు శ్రీహరి…తెలుగుదేశం
1980 ఎస్.బి.పి. పట్టాభి రామారావు కాంగ్రెస్….
1977..ఎస్.బి.పి. పట్టాభి రామారావు కాంగ్రెస్….
1971..ఎస్.బి.పి. పట్టాభి రామారావు కాంగ్రెస్….
1967..లెఫ్టినెంట్ కన్నల్ డి.ఎస్. రాజు…
కాంగ్రెస్
1962….లేఫ్ట్నెంట్ కన్నల్ డి.ఎస్.రాజు …కాంగ్రెస్..
1957…లెఫ్టినెంట్ కన్నల్ డి.ఎన్. రాజు.కాంగ్రెస్…
1952….కానేటి మోహన్రావు, కమ్యూనిస్ట్ పార్టీ.
1952….నల్లా రెడ్డి నాయుడు…
సోషలిస్ట్ పార్టీ