భూమిపై అనేక చోట్ల ఎల్లప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి. మానవులు నివసించే ప్రాంతాల్లో భూకంపాలు వచ్చినప్పుడు అక్కడ జరిగే విధ్వంసం గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చంద్రునిపై రహస్యాలను తెలుసుకునేందుకు పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్న వేళ.. జాబిల్లిపై కూడా భూకంపలు వస్తాయా అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే శాస్త్రవ్తేత్తలు చంద్రునిపై కూడా భూకంపాలు వస్తుంటాయని చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో ఉండదు.
భూమిపై అనేక చోట్ల ఎల్లప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి. మానవులు నివసించే ప్రాంతాల్లో భూకంపాలు వచ్చినప్పుడు అక్కడ జరిగే విధ్వంసం గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చంద్రునిపై రహస్యాలను తెలుసుకునేందుకు పలు దేశాలు ప్రయోగాలు చేస్తున్న వేళ.. జాబిల్లిపై కూడా భూకంపలు వస్తాయా అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే శాస్త్రవ్తేత్తలు చంద్రునిపై కూడా భూకంపాలు వస్తుంటాయని చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో ఉండదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమిపై ఉన్నట్లుగా లేవు. అయినా కూడా అక్కడ భూకంపాలు వస్తున్నాయి. తాజాగా చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడ భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. భూమిపై వచ్చే భూకంపాల కంటే.. చంద్రునిపై వచ్చేవిశక్తిమంతగా ఉంటాయని.. అలాగే ఒక్కోసారు వాటి తీవ్రత 20 రేట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇక భూమిపై ఉండే పలు సాధనాలు భూకంపాల గురించి సమాచారాన్ని అందిస్తాయి. అయితే జాబిల్లిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాల్లో సిస్మోమీటర్ను విడిచిపెట్టారు. కానీ జాబిల్లిపై ఈ సిస్మోమీటర్లు కేవలం 5 ఏళ్లు మాత్రమే పనిచేస్తాయి. అయితే అవి ఆ సమయంలో ఏకంగా 12 వేల భూకంపాల గురించి సమాచారాన్ని అందించాయి. అలాగే జాబిల్లిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో ఒకటి లోతైన భూకంపం, రెండోవది తేలికపాటి, మరొకటి నిస్సార భూకంపం, ఇక నాలుగోవది థర్మల్ భూకంపం. లోతైన భూకంపాలు అనేవి జాబిల్లిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుంచి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవిస్తుంటాయి.
ఇక భూమిపై ఉన్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసే విధంగా.. చంద్రుని లోతైన రాతి కోర్‌పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని.. అయితే ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రాజ్ఞులు అంటున్నారు. అలాగే చంద్రనిపై ఉండే ఉల్కలు పరస్పరం ఢీకోనడం వల్ల కూడా భూకంపాలు వస్తాయి. అంతేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల కూడా ఉష్ణ భూకంపాలు వస్తుంటాయి. వాస్తవానికి రెండు వారాల పాటు చంద్రునిపై చీకటే ఉంటుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోతుంది. అలాగే పగటి సమయంలో 121 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఇలాంటి హెచ్చుతగ్గుల వల్ల భుకంప తరంగాలు అక్కడ ఉత్పన్నమవుతున్నాయి. చంద్రునిపై వచ్చే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5 కంటే ఎక్కువగా నమోదవుతుంది. ఇక చంద్రునిలోపలున్న టెక్టోనిస్ ప్లేట్.. ఇటీవల ఏర్పడిన బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ భూకంపాలు కూడా 10 నుంచి 30 సెకండ్ల పాటు ఉంటాయని.. మరికొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయని చెబుతున్నారు.