స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు పాత్రలో కనిపించాడు రవితేజ. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో క్యూరియాసిటిని పెంచేసిన మేకర్స్.. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో షూరు చేశారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
మాస్ మాహారాజా రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వర రావు సినిమాతో థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు వంశీ దర్శకత్వం వహించారు. ఇందులో స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు పాత్రలో కనిపించాడు రవితేజ. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఈగల్‘. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో క్యూరియాసిటిని పెంచేసిన మేకర్స్.. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో షూరు చేశారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సోమవారం ఉదయం విడుదలైన టీజర్ చూస్తుంటే.. రవితేజ ఖాతాలో మరో హిట్ పడనున్నట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా విడుదలైన టీజర్లో రవితేజ గురించి గొప్పగా.. ఒక కథలా చెప్పారు. ముందుగా రవితేజ లుంగీ కట్టి.. తుపాకీ చేత పట్టి మరింత మాస్‌గా కనిపించారు. ముందుగా పూర్తిగా చీకటిలో బాంబ్ పేలిన ప్రదేశాలను చూపిస్తూ.. “కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఊనికి ఉండదు” అంటూ రవితేజ వాయిస్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు.. కానీ వ్యాపించి ఉంటాడు అంటూ అవసరాల శ్రీనివాస్ చెప్పడం.. ఆ తర్వాత “ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపమే” అంటూ నవదీప్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
రవితేజ గురించి అనుపమ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జనాలకు కట్టు కథ.. ప్రభుత్వాలు కప్పెట్టిన కథ.. ఒక వ్యక్తి అన్నిచోట్లు ఉంటాడు అంటూ వచ్చే డైలాగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాడు. ఇక టీజర్లో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. మధుబాల, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు.