దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇవాళ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు విచారణలో తేల్చనున్నారు. డ్రగ్స్ పార్టీకి క్రిష్ కూడా హాజరైనట్టు తెలిసి అతడిని విచారణకు పోలీసులు పిలిచారు. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురి అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టలు చోటుచేసుకుంటున్నాయి. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ వాంగ్మూలంలో అసలు విషయాలు బయటపడ్డాయి. మీర్జా వహీద్ దగ్గర కొకైన్ కొనుగోలు చేసిన అబ్బాస్.. దాన్ని గజ్జల వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు అప్పగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రాము కొకైన్ రూ.14 వేలకు కొని వివేకానందకు విక్రయించాడు అబ్బాస్. ఏడాదిగా డ్రగ్స్‌కు అలవాటుపడ్డ గజ్జల వివేకానంద.. డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్.. గూగుల్ పే పేమెంట్స్‌ను సేకరించారు పోలీసులు.
వీకెండ్స్ లో రెగ్యులర్‌గా రాడిసన్ హోటల్‌కి వచ్చే వివేకానంద్.. తన స్నేహితులతో ఏడాదిగా పార్టీలు నిర్వహించేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. వివేకానంద్ నిర్వహించే డ్రగ్స్ పార్టీలకు.. సినీ, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. రీసెంట్ గా ఫిబ్రవరి 16, 18, 19, 24 న సైతం గజ్జల వివేకానందకు అబ్బాస్ కొకైన్ సప్లై చేసినట్లు గుర్తించారు మాదాపూర్ పోలీసులు. డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్నారు డైరెక్టర్ క్రిష్. A10 నిందితుడిగా ఉన్న క్రిష్ పరారీలో ఉన్నట్టు కోర్టుకు తెలిపారు పోలీసులు. ఇప్పటికే క్రిష్‌కు 160 కింద నోటీసులు జారీ చేశారు.
రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతుంది. కేసులో నిందితుడిగా తేలితే డైరెక్టర్ కిష్ని అదుపులోకి తీసుకుంటామన్నారు మాదాపూర్ డీసీపీ. కేసులో A1 గా గజ్జెల వివేకానంద, A2గా అబ్బాస్ అలీ జాఫ్రీ, A3 నిర్భయ్ సింధి, A4 రఘుచరణ్, A5 కేధర్నాథ్, A6 సందీప్, A7 శ్వేత, A8 లిషి, A9 నీల్, A10 డైరెక్టర్ క్రిష్, A11 వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్, A12 మీర్జా వహిద్ బేగ్ ను చేర్చారు పోలీసులు. 41A సీఆర్పీసీ సెక్షన్ కింద కేసులు నమోదుచేశారు.
అందులో భాగంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇవాళ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు విచారణలో తేల్చనున్నారు. డ్రగ్స్ పార్టీకి క్రిష్ కూడా హాజరైనట్టు తెలిసి అతడిని విచారణకు పోలీసులు పిలిచారు. ఇక ఈ కేసులో ఇప్పటికే పలువురి అరెస్ట్ చేశారు. అయితే ఈ హోటల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దర్యాప్తుకు అడ్డంకి మారింది.