తిరుమల,నవంబర్10(ఆంధ్రపత్రిక):తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది. ప్రతి రోజు పోటు కార్మికులు తయారు చేసిన లడ్డూ ప్రసాదాలను ఒక ప్రత్యేక ట్రేలో ఉంచి, ప్రతి ట్రే బరువును పోటు అధికారులు తనిఖీ చేస్తారు. అనంతరం లడ్డూ ప్రసా దాలను కౌంటర్లకు తరలించి, భక్తులకు అందిస్తారు. ఇందులో పూర్తి పారదర్శకత ఉంటుంది. వేయింగ్ మిషన్లో సాంకేతిక సమస్య కారణంగా మైనస్ 70 అని ఉండటం, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం కారణంగా లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు గురయ్యారు. లడ్డూ బరువు కచ్చితంగా 160 నుండి 180 గ్రాములు ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా లడ్డూ బరువు, నాణ్యత విషయంలో కూడా టీటీడీ ఏనాడు రాజీ పడలేదు. సాధారణంగా లడ్డూ కౌంటర్ల వద్ద ఏదేని ఇబ్బంది తలెత్తితే వేంటనే అక్కడ అందుబాటులో ఉన్న లడ్డూ కౌంటర్ అధికారికి తెలియజేస్తే, అక్కడిక్కడే సమస్యను పరిష్కరించే వ్యవస్థ టీటీడీలో ఉంది. కానీ సదరు భక్తుడు ఇవిఏమి చేయకుండా సోషల్ మీడియాలో టీటీడీపై ఇలాం టి ఆరోపణలు చేయడం శోచనీయం. కావున భక్తుడు ఆరోపించినట్లు లడ్డూ పరిమాణం, బరువులో ఎలాంటి వ్యత్యాసం లేదు. సామాజిక మాధ్యమాలలో వస్తున్న ఇలాంటి అపోహలను భక్తులు నమ్మవద్దని టీటీడీ కోరడమైనది.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!