వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో చెవికి గాయమైన సంగతి తెలిసిందే. దీనిగురించి తాజాగా ట్రంప్ స్పందించారు.
ఆ దాడిలో తాను చనిపోయాననే అనుకున్నానని అన్నారు. ఈమేరకు అమెరికన్ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. ”అసలు నేను మీ ముందు ఇలా ఉండేవాడినే కాదు. కాల్పుల ఘటనలో చనిపోయాననే అనుకున్నాని తెలిపారు.
ఇదొక చిత్రమైన పరిస్థితి” అని ట్రంప్ తెలిపినట్లు మీడియా సంస్థ వెల్లడించింది. ఆ సమయంలో ఆయన చెవికి బ్యాండేజ్ ఉన్నట్లు తెలిపింది. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో పాల్గొనేందుకు విమానంలో ప్రయాణిస్తూ ట్రంప్ ఈవిధంగా స్పందించారు. ”ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యంగా లేదని అన్నారు. కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైంది. నా కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది” అని ట్రంప్ దాడి వెంటనే స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ట్రంప్ విజయావకాశాలు పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.